Home > వైరల్ > ఇస్రో చీఫ్ జీతం ఎంతో చెప్పిన హర్ష గోయెంకా..

ఇస్రో చీఫ్ జీతం ఎంతో చెప్పిన హర్ష గోయెంకా..

ఇస్రో చీఫ్ జీతం ఎంతో చెప్పిన హర్ష గోయెంకా..
X

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఎంతో మంది ఆయన గురించి నెట్లో వెతికారు. దేశానికి సంబంధించి కీలకమైన స్థానంలో ఉన్న ఆయన జీతమెంత అని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఇస్రో చైర్మన్ జీతానికి సంబంధించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.

ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ నెల జీతం రూ. 2.5 లక్షలు అని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. ఆయన స్థాయికి ఇది సరైనా వేతనమా అని నెటిజన్లను ప్రశ్నించారు. ‘‘ మీరు చెప్పండి. ఇది ఆయనకు సరైన జీతమేనా?. డబ్బే కాకుండా ఎన్నో ఉన్నతమైన అంశాలు ఆయనలాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయి. టెక్నాలజీ, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన పనిచేస్తున్నారు. సోమనాథ్‌ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అని గోయెంకా ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటివరకు ఈ ట్వీట్ను 8లక్షల ముంది చూశారు. ‘‘మీరు సరిగ్గా చెప్పారు. ఆయన లాంటి వారు ఇల్లు, కారు, డబ్బు కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నారు’’అని కొందరు కామెంట్ చేశారు. ఇంఅంకితభావం, నిబద్ధతలే ఇస్రో చైర్మన్ను అభివృద్ధి వైపు నడుపిస్తున్నాయని.. వాటికి డబ్బుతో కొలవలేం..సాంకేతికత, పరిశోధనలు, దేశ అభివృద్ధి కోసమే వారు కృషి చేస్తారు’’ అని మరికొందరు కామెంట్ చేశారు. కొకరు రాసుకొచ్చారు. ‘‘ఆయనకు నెలకు రూ. 25 లక్షల కంటే ఎక్కువ జీతం రావాలి. ఆయన సామర్థ్యానికి తగిన ప్రోత్సాహకం దక్కాలని కోరుకుంటున్నాను’’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.


Updated : 12 Sept 2023 6:47 PM IST
Tags:    
Next Story
Share it
Top