Viral News : పామును ముద్దాడిన ఆవు..ఆ తరువాత ఏమైందంటే!
X
మనకు తెలిసినంత వరకు జంతువుల్లో వేర్వేరు జాతుల మధ్య పెద్దగా సఖ్యత ఉండదు. అవి ఎదురుపడిన ప్రతిసారి ఎక్కువ శాతం గొడవ పడేందుకే ప్రయత్నిస్తుంటాయి. కాస్త బలమున్న జంతువులు బలహీనమైన వాటిని భయపెట్టి తరిమేస్తుంటాయి. అవి వెనక్కి వెళ్లకపోతే గొడవకు దిగుతాయి. అయితే ఈసారి సాదుజంతువైన ఆవు, విషసర్పం ఎదురుపడ్డాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆవు, పాము ఎదురుపడటం చూసి నెటిజన్స్ ఒకింత షాక్కు గురయ్యారు. ఆవుకు ఏమన్నా అవుతుందేమోనని కంగారు పడ్డారు. అయితే సీన్ కట్ చేస్తే ఆవు మాత్రం తనకు ప్రమాదం ఉందని గ్రహించకుండా ఆప్యాయంగా పామును ముద్దాడింది, ఆ తరువాత పాము ఏం చేసిందనేదే అసలు ట్విస్ట్.
నిత్యం వన్యప్రాణుల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసే IFS అధికారి సుశాంత నంద తన ట్విటర్ అకౌంట్లో ఈ అవు, పాముల వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నాగు పాము, అవు ఎదురుపడటంతో రెండింటికీ మధ్య పోరు జరుగుతుందని అందరూ ఊహించారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఈ రెండూ ఒకదానిపై మరొకటి ప్రేమను, ఆప్యాయతను కురిపించుకున్నాయి. ఈ వీడియోలో ఆవు పాము దగ్గరకు వచ్చి తన నాలుకతో ఆప్యాయంగా నిమిరింది. పాము కూడా ఆవు ప్రేమకు ఫిదా అయ్యింది. అందుకే తన తలను కిందకు వంచి ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో 4.60 లక్షలకు పైగా వ్యూవర్స్ వీక్షించారు. "నమ్మలేకపోతున్నా. ఇది నిజమేనా", "నాగరాజుతో ఆవు ప్రేమలో పడిందేమో" "స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం" అంటూ నెటిజన్స్ తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.