Bengaluru : రోడ్డుపై ల్యాండైన హెలికాఫ్టర్.. నిలిచిన ట్రాఫిక్
X
దేశంలో పెరుగుతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతుంది. ఇక బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ రోడ్డు మీదకు వెళ్తే మళ్లీ ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో తెలియని పరిస్థితి. అంతలా ఉంటుంది అక్కడ ట్రాఫిక్ పరిస్థితి. ట్రాఫిక్తో ఈ నగరం ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా బెంగళూరు రోడ్డుపై హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది.దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
బెంగుళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కార్యాలయం సమీపంలోని రోడ్డుపై ఓ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. సరిగ్గా రోడ్డుకు మధ్యలో హెలికాప్టర్ దించడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఆ హెలికాప్టర్‌ని చూస్తూ వాహనదారులంతా రోడ్డుపై అలాగే నిలిచిపోయారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ట్రాఫిక్ సమస్యకు కారణం ఇలాంటివే.. అంటూ రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు కేవలం రోడ్డుమీద నడిచే వాహన డ్రైవర్లకు మాత్రమే కాదు.. పైలట్లకు కూడా చేయాలి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి ‘‘ఓ పక్షి రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అందుకనే ఆఫీసుకు రావటానికి ఆలస్యం అయిందని బాస్‌కు చెప్తాను’’ అని కామెంట్ చేశారు.
@peakbengaluru Bangalore Traffic reasons 😂😂#G20India2023 #Bengaluru @HALHQBLR pic.twitter.com/jK353vFyGp
— Aman Surana (@surana620) September 7, 2023