Home > వైరల్ > చిన్మయి పిల్లలతో ఆడుకున్న సమంత

చిన్మయి పిల్లలతో ఆడుకున్న సమంత

చిన్మయి పిల్లలతో ఆడుకున్న సమంత
X

గాయని చిన్మయి, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ లు సమంతకు బెస్ట్ ఫ్రెండ్స్. సమంత హిట్ అవ్వడానికి చిర్మయి కూడా ఒక కారణమని చెప్పొచ్చు. చిన్మయి గొంతు సమంత కి సరిపోయినట్టు మరెవ్వరికీ సరిపోదు. కెరీర్ మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకనే బాలి నుంచి రాగానే సమంత చిర్మయి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. అక్కడ తన పిల్లలతో హాయిగా టైమ్ స్పెండ్ చేసింది.

చిన్నపిల్లలతో కలిసపోయి సమంత చేసిన అల్లరి చూడముచ్చటగా ఉంది. చిర్మయి, రాహుల్ రవీంద్రన్ కు ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరూ కవలలు. వీళ్ళు చెన్నైలో ఉంటారు. సమంతకు ముఖ్యమైన అకేషన్స్ లేదా ఇతర వాటిల్లో దేనిలో అయినా వీళ్ళిద్దరూ తప్పనిసరిగా ఉంటారు. అందుకే సరదా గడపడానికి వాళ్ళింటికి వెళ్ళిపోయింది. అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకుంది. చిన్నారులతో ఆర్ఆర్ఆర్ సినిమకు స్టెప్పులేయించింది. వాళ్ళతో సమానంగా కాసేపు తానూ చిన్న పిల్ల అయిపోయింది.

దీనికి సంబంధించిన వీడియోలను సామ్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆమె అలా హ్యాపీగా ఉండండం...అభిమానులకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత తన మయోసైటిస్ వ్యాధికి చికిత్సను తీసుకుంటూ మిగతా సమయాల్లో ఇలా సంతోషంగా గడపడానికి ట్రై చేస్తోంది.

Updated : 7 Aug 2023 11:59 AM IST
Tags:    
Next Story
Share it
Top