Home > వైరల్ > బ్రహ్మం గారు చెప్పిందే నిజం అయింది.. పబ్లిక్గా మనిషి మాంసాన్ని అమ్ముతున్నరు

బ్రహ్మం గారు చెప్పిందే నిజం అయింది.. పబ్లిక్గా మనిషి మాంసాన్ని అమ్ముతున్నరు

బ్రహ్మం గారు చెప్పిందే నిజం అయింది.. పబ్లిక్గా మనిషి మాంసాన్ని అమ్ముతున్నరు
X

నాన్ వెజ్ ప్రియులకు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, ఫిష్.. ఇలా ఏదో ఓ రకం వండుకుని తింటుంటారు. అలాంటి వాళ్లకోసం కొత్త రకం మాంసం మార్కెట్ లోకి వచ్చింది. అది కూడా మార్కెట్ లో దొరికే మాంసం కంటే.. తక్కువ ధర, రుచి ఎక్కువతో. అబ్బ త్వరగా అడ్రస్, డిటైల్స్ చెప్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నం అంటున్నారా. అయితే ఒక నిమిషం ఆగాల్సిందే. ఎందుకంటే.. అది జంతువుదో, పక్షిదో కాదు. మనిషి మాంసం. అవును మీరు విన్నది నిజమే. తక్కువ ధర, రుచి ఎక్కువ అని చెప్తే.. పబ్లిక్ గా మనిషి మాంసాన్ని అమ్ముతున్నారు. బ్రిటన్ కు చెందిన గుడ్ హార్వెస్ట్ అనే ఆహార ఉత్పత్తి సంస్థ మనిషి మాంసాన్ని అమ్ముతోంది.

మొక్కల నుంచి మాంసాన్ని తయారు చేయడం చూసుంటారు. రక్తాన్ని కూడా తయారుచేయడం గురించి విని ఉంటారు. కానీ, ఈ గుడ్ హార్వెస్ట్ కంపెనీ లాబోరేటరీలో ప్రయోగాలు చేసి మనిషి మాంసాన్ని తయారుచేస్తోంది. అయితే, అది పూర్తిగా ఆర్టిఫిషియల్ అనేంకాదు. ఈ ఇంజినీర్డ్ హ్యూమన్ మీట్ తయారీ కోసం డోనర్ల నుంచి మాంసాన్ని సేకరిస్తుంది. అందుకు వాళ్లకు కొంత మొత్తంలో డబ్బులు చెల్లిస్తుంది. అలా సేకరించిన మాంసంతో ల్యాబ్ లో ప్రయోగాలు చేసి పెద్ద పెద్ద మాంసపు ముద్దలుగా పెంచుతున్నారు.

అలా తయారుచేసి మాంసపు ముక్కలను మంచి ప్యాక్ చేసి.. సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇప్పటికే ఈ మనిషి మాంసంతో లండన్‌లోని ఓ రెస్టారెంట్లో ప్రయోగాలు చేశారు. రకరకాలుగా వండి రుచి కూడా చూశారు. అంతేకాకుండా చిన్న పిల్లల మాసం నుంచి తయారుచేసిన మాంసం ఇంకా రుచిగా ఉంటుందని గుడ్ హార్వెస్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ విషయం తెలియగానే నెటిజన్స్ తీవ్రంగా మండి పడుతున్నారు. కొందరైతే.. ‘బ్రహ్మ గారి కాలజ్ఞానంలో చెప్పిందే నిజం అయింద’ని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మనిషి మాంసాన్ని అమ్మడం ఏంటని మండి పడుతుంటే.. దానికి సమాధానం ఇచ్చారు గుడ్ హార్వెస్ట్ సీఈవో గ్రెగ్ వ్యాలెస్. తమ ప్రయోగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, జీవన వ్యయ సంక్షోభానికి కొత్త పరిష్కారం చూపేందుకు మనిషి మాంసాన్ని తయారుచేసినట్లు చెప్పుకొచ్చారు.


Updated : 26 July 2023 6:27 PM IST
Tags:    
Next Story
Share it
Top