చెప్పులేసుకుని జెండా ఎగరవేయడంపై విమర్శలు..తప్పు లేదన్న హీరోయిన్
X
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. భారత్ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో జెండా పండుగ జరుపుకున్నారు. ప్రముఖులు సైతం జెండావందనంలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి కూడా ముంబై జుహూలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అయితే ఆమె వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనికి శిల్పాశెట్టి షూ వేసుకొని జెండా ఎగరవేయడమే కారణం.
శిల్పాశెట్టి షేర్ చేసిన వీడియోలో ఆమె షూ వేసుకొని జెండా వందనంలో పాల్గొనడం కనిపించింది. దీంతో భారీగా ట్రోలింగ్ మొదలైంది. జాతీయ జెండాను అవమానించారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అయితే ట్రోలింగ్‌పై ఆమె ధీటుగా స్పందించింది. ఫ్లాగ్ కోడ్‌లో చెప్పులేసుకోకూడదన్న నియమం ఎక్కడా లేదంటూ గూగుల్ లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ పోస్ట్ చేసింది. తనకు రూల్స్ తెలుసు అని..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.