నో నాన్ వెజ్ విలేజ్.. అందుకు అంగీకరిస్తేనే పెళ్లి
X
ప్రస్తుతం వెజిటేరియన్స్ తక్కువైపోయారు. నాన్ వెజ్ తినడానికి అలవాటు పడిపోయారు. మాంసం ముక్క లేనిదే.. ముద్ద దిగట్లేదు. అలాంటిది ఈ ఊరు మొత్తం మాంసం ముట్టదు. ఆ ఊళ్లోకి కోడళ్లుగా వెళ్లే వాళ్లు కూడా.. శాఖాహారిగా మారితేనే పెళ్లికి అంగీకరిస్తారు. లేదంటే.. ఎంత వయసొచ్చినా.. నో పెళ్లి అంటూ కూర్చుంటారు. దీనికి కారణం ఏంటి..? ఆ ఊరు ఎక్కడ ఉందంటే..?
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ తాలూకా రేనవి గ్రామాన్ని శాకాహార గ్రామంగా పిలుస్తారు. ఇక్కడి ప్రజలు వందల ఏళ్లుగా మాంసాహారాన్ని ముట్టట్లేదు. చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఆ గ్రామంలో పవిత్రమైన రేవణ సిద్ధ ఆలయం ఉండటం వల్ల గ్రామస్తులు శాకాహారులుగా మారిపోయారు. స్థానిక యువకులు కూడా వాళ్లు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు శాఖాహారులుగా మారితేనే పెళ్లికి అంగీకరిస్తారు. రావణుడి మహిమ కారణంగా ఈ గ్రామం పూర్తిగా శాఖాహారంగా మారింది. ఇక్కడి హిందూ, ముస్లింలతో సహా అన్ని మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.