Viral Video : స్పామ్ కాల్స్‌కు ఇలా చెక్ పెడితే చచ్చినా చేయరు.. వీడియో వైరల్
X
ఇంట్లోనో, ఆఫీసులోనో, ప్రయాణంలోనే ఉన్నప్పుడు కొంపలు మునిపోతున్నట్లు ఫోన్ రింగ్ అవుతుంది. స్నేహితులో, కుటుంబ సభ్యులో, బంధువులో చేశారేమోనని తీసి చూస్తే స్పామ్ అని వెక్కిరిస్తుంది. లేకపోతే ఫ్రాడ్ కాల్ అని, క్రెడిట్ కార్డ్ బిజినెస్ అని కనిపిస్తుంది. ‘బిచ్చగాడు’, ‘బేవార్స్’, ‘లోఫర్’ అనే వింతవింత పేర్లు కూడా కనిపిస్తుంటాయి. పేర్లకు బదులు పర్సనల్ నంబర్లూ కనిపిస్తాయి. లిఫ్ట్ చేస్తే చాలు.. మీకు ఫ్లాట్ కావాలా, మీకు లోన్ కావాలా, ఆన్‌లైన్ బిజిన్ చేస్తారా, మీరు ఎవరికి ఓటేస్తారు వంటి సవాలక్ష కాల్స్. ఎన్ని నంబర్లను బ్లాక్ చేసినా ఫలితం ఉండదు. అలాంటి స్పామ్ కాల్స్‌తో విసిగి ఓ మహిళ చెవులు దిమ్మిక్కి చెవుడు వచ్చే ఉపాయం కనిపెట్టింది. ఫోన్ చేసి సతాయించే మనిషి జన్మలో మళ్లీ చేయకుండా నరక లోకంలో వేసే శిక్షల కన్నా ఘోరమైన శిక్ష వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలో.. ఓ మహిళకు స్పాక్ కాల్ వస్తుంది. ఆమె రంగంలోకి దిగి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తర్వాత దానిపై ఓ స్టీలు గిన్నెను బోర్లించి, గరిటతో ధనాధనా బాదుతుంది. అతవల లైన్లో ఉన్న మానవుడు/మానవురాలు వింటే కర్ణభేరులు పగిలిపోయేలా మోగిస్తుంది. నేషనలిస్ట్2575 అనే ట్విటరాటీ ఈ వీడియోను పంచుకున్నారు. కొందరు మెచ్చుకుంటుంటే కొందరు అనవసరం అంటున్నారు. స్టీలు గిన్నె మంత్రంలో కాకుండా పద్ధతిగానే మార్కెటింట్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెట్టొచ్చు. టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) దీని కోసం ఒక సదుపాయం కల్పిస్తోంది. నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్(ఎన్సీపీఆర్) ద్వారా దీన్ని వాడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో ఆండ్రాయిడ్ యూజర్లకు కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్లను ఎనేబుల్ చేయొచ్చు. కృత్రిమ మేధ(ఏఐ) ఫిల్టర్ల ద్వారా స్పామ్ కాల్స్‌ను గుర్తించి అడ్డుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు మాటిమాటికీ చెబుతున్నా అవి పట్టించుకోడం లేదు.
Had enough of spam calls ? Try this.
— Nationalist (@Nationalist2575) August 18, 2023
True Indian Innovation..
I am gonna do this tomorrow with @Bajaj_Finserv 🤣🤣🤣🤣 pic.twitter.com/tJTRDC0VOo