ఓ ప్రయత్నం.. ఓటర్లకు ఉచిత జిలేబీ, పోహా
X
తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మోదలయింది. పార్టీలన్నీ ఓటర్లను ప్రభావితం చేసే మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీలు హామీలు ప్రకటించడం మామూలు విషయమే. కానీ మధ్యప్రదేశ్, ఇండోర్ లోని ఓ దుకాణదారుల అసోసియేషన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించింది. ఫ్రీ ఫ్రీ అంటూ ఓ ఆఫర్ తో ముందుకొచ్చింది. మధ్యప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ఎవరు ఓటేస్తే వారికి ఫ్రీగా జిలేబీ, పోహా అందిస్తామని ప్రకటించింది. అయితే దీనికో కారణం ఉంది.
ఈ ఆఫర్ ను 56 దుకాణ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని 230 స్థానాల్లో నవంబర్ 17న ఒకే విడతలో ఎలక్షన్స్ జరుతాయి. ఈసారి కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఎన్నికల రోజు ఎవరైతే తొలుత ఓటు వేసి వేలికి ఇంకును చూపిస్తారో వారికే ఫ్రీగా జిలేబీ, పోహా అందిస్తారు. అయితే ఈ ఆఫర్ పోలింగ్ రోజు ఉదయం 9 గంటల వరకే వర్తిస్తుంది. అయితే పోలింగ్ అధికశాతం జరగాలని, ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆఫర్ పెట్టినట్లు అసోసియేషన్ తెలిపింది. పరిశుభ్రతలో టాప్ ప్లేస్ లో ఉన్న ఇండోర్.. ఓటింగ్ లో కూడా టాప్ లో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Indore 56 Shop Traders Association announced offer to the voters
National News,Madhya Pradesh,indore,56 Shop Traders Association, offer to voters,free jilebi,free poha,Madhya Pradesh elections,assembly elections,5 states elections