Home > వైరల్ > సింగిల్ హ్యాండ్ సిక్సర్.. పంత్ను గుర్తు చేశాడు.. వీడియో వైరల్

సింగిల్ హ్యాండ్ సిక్సర్.. పంత్ను గుర్తు చేశాడు.. వీడియో వైరల్

సింగిల్ హ్యాండ్ సిక్సర్.. పంత్ను గుర్తు చేశాడు.. వీడియో వైరల్
X

ట్రినిడాడ్ వేదికపై వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. టీ20 తరహాలో సిక్సర్లు, ఫోర్లు బాదుతూ విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. టీమిండియా దీంతో 364 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్స్ రెచ్చిపోయి ఆడారు. టెస్ట్ మ్యాచ్ అని మరిచి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (57, 44 బంతుల్లో), జైశ్వాల్ (38, 30 బంతుల్లో) శుభారంబాన్ని అందించారు. తర్వాత నాలుగో వికెట్లో వచ్చిన ఇషాన్ (52, 34 బంతుల్లో) సాధించాడు.

అందులో 2 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అయితే, కీమర్ రోచ్ బౌలింగ్ లో కొట్టిన ఓ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాకెండ్ లో సింగిల్ హ్యాండ్ తో ఇషాన్ ఓ భారీ సిక్స్ కొట్టాడు. అది చూసిన ఫ్యాన్స్ ‘అచ్చం రిషబ్ పంత్ లాగే కొట్టాడు’, ‘పంత్ ను గుర్తు చేస్తున్నాడు’, ‘పంత్ లేని లోటు తీర్చుతున్నాడు’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ప్రస్తుతం 364 పరుగుల భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన విండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

Updated : 24 July 2023 10:17 PM IST
Tags:    
Next Story
Share it
Top