దీనమ్మ జీవితం...శాండ్ విచ్ను కట్ చేసినందుకు అంత బిల్లా !
X
రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేస్తే మనం ఇచ్చిన ఆర్డర్స్‌కు మాత్రమే బిల్ వేస్తారు. ఎక్స్ ట్రా ఐటెమ్స్ ఇస్తే వాటిని బిల్లో యాడ్ చేస్తారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోటల్ రూటే సెపరేటు. మనం తిన్న ఆహారంతో పాటు, సర్వీసింగ్‌కు, ప్లేట్స్‌కు కూడా బిల్ వేస్తారు. ఈ వింత అనుభవాన్ని ఓ కస్టమర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం, లేక్ కోమో సమీపంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి వెళ్లాడు. శాండ్ విచ్ను ఆర్డర్ చేశాడు. అది వచ్చాక రెండు ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలని కోరాడు. చివరికి బిల్ ను చూసిన అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. శాండ్ విచ్ను రెండు పీసులుగా చేసినందుకు కూడా చార్జీ విధించడంపై అవాక్కయ్యాడు.
శాండ్ విచ్ అసలు ఖరీదు 7.50 యూరోలు. దీనికి కట్ చేసినందుకు 2 యూరోలు విధించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.180 వసూలు చేశారు. అదే బిల్లులో ఒక కాఫీకి విధించిన చార్జీ 1.20 యూరోలే. అంటే కాఫీ కంటే శాండ్ విచ్ కట్ చేసినే బిల్లు ఎక్కువ. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రెస్టారెంట్ యజామాన్యం మాత్రం తమ చర్యను సమర్థించుకుంటుంది.‘రెండు పీసులుగా చేయడం వల్ల వాటికి రెండు ప్లేట్లు వాడాలి. అటువంటప్పుడు రెండు ప్లేట్లు కడుక్కోవాలి. ఇందుకు పట్టే సమయం, శ్రమకు ఆ మాత్రం చార్జీ అవుతుంది’’ అని రెస్టారెంట్ యజమాని క్రిస్టినా బైచి చెప్పడం విశేషం