Home > వైరల్ > రిబ్ టాటూ అంటే తెలుసా.. 'జాను' బ్యూటీ ఫోటో వైరల్

రిబ్ టాటూ అంటే తెలుసా.. 'జాను' బ్యూటీ ఫోటో వైరల్

రిబ్ టాటూ అంటే తెలుసా.. జాను బ్యూటీ ఫోటో వైరల్
X

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్లుగా చేసిన తమిళ రీమేక్ 'జాను' సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ కాలేదు కానీ.. విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది. ఈ సినిమాలో ఆయా పాత్రల పెర్ఫామన్స్ అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. సినిమాలో చిన్నప్పుడు సమంత పాత్రలో నటించిన గౌరి కిషన్.. తన పాత్ర పరిధి మేర బాగా నటించింది. అయితే తమిళ్‌లో వచ్చిన ఈ సినిమా(96)లో కూడా ఆ క్యారెక్టర్‌ను గౌరినే చేసింది.ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన గౌరి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

ఈ మధ్యే తెలుగులో సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో హీరోయిన్ గా కూడా చేసింది. ప్రస్తుతం పలు తమిళ్, మలయాళం సినిమాలు చేస్తుంది. తాజాగా తన ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్టుతో గౌరి వార్తల్లో నిలిచింది. ఇటీవల తాను టాటూ వేయించుకుంటున్నాను అని ప్రకటించింది. తాజాగా తన టాటూని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

గౌరీ తన రైట్ సైడ్ నడుము పై భాగంలో చేయి కింద నుంచి వచ్చి.. వంపు తిరిగిన లేత పచ్చ తీగలా ఉన్న టాటూని వేయించుకుంది. దీనిని రిబ్ టాటూ అంటారు. ఇక ఈ టాటూని ఫొటో తీసి పెట్టగా ఇది వైరల్ గా మారింది. తన టాటూ పూర్తిగా కనిపించేలా పోస్ట్ చేయడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. పలువురు టాటూని ఆ ప్లేస్ లో వేసుకున్నందుకు విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు.




Updated : 19 July 2023 12:16 PM IST
Tags:    
Next Story
Share it
Top