Home > వైరల్ > కొత్త రూల్: అమ్మాయిలకు పొరపాటున హార్ట్ ఎమోజీ పంపినా.. ఇక జైలుకే

కొత్త రూల్: అమ్మాయిలకు పొరపాటున హార్ట్ ఎమోజీ పంపినా.. ఇక జైలుకే

కొత్త రూల్: అమ్మాయిలకు పొరపాటున హార్ట్ ఎమోజీ పంపినా.. ఇక జైలుకే
X

సోషల్ మీడియాలో ఏం వాడాలన్నా.. ఏం నొక్కాలన్నా భయపడే పరిస్థితులు ఉన్నాయి. తెలియక ఒక లింక్ క్లిక్ చేస్తే.. డబ్బులు పోవడంమే కాకుండా.. ఈ మధ్య హనీ ట్రాప్ లో పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త సమస్య వెలుగలోకి వచ్చింది. క్లోజ్ గా చాటింగ్ చేస్తుంది కదా అని అమ్మాయికి హార్ట్ ఎమోజీ పంపిస్తే.. ఇక జైలుకు వెళ్లడం కాయం. అవును మీరు వింటున్నది నిజమే. అయితే.. ఈ రూల్ ఉన్నది మన దేశంలో కాదు లేండి. సౌదీలో. అరబ్ దేశాల్లో వింత రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయో తెలిసిందే. ఏమాత్రం రాజీ పడకుండా ఆ కఠిన చట్టాలను అమలు చేస్తుంటారు. అక్కడ జీవించాలంటే చట్టాలను ఫాలో కావాల్సిందే. లేదంటే అడ్డంగా బుక్ అవుతారు. ఎందుకంటే.. అక్కడ చిన్న చిన్న తప్పులకు కూడా జైలు శిక్ష విధిస్తుంటారు.

అంతేకాకుండా అరబ్ దేశాల్లో మహిళల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అక్కడ ఓ మహిళతో చాటింగ్ చేసేటప్పుడు.. పొరపాటున హార్ట్ ఎమోజీలాంటివి పంపినా భారీ శిక్ష విధిస్తారు. ఎందుకంటే.. మన ఫీలింగ్స్ తెలిపే ఎమోజీలను అమ్మాయిలకు పంపడం సౌదీలో నిషేదం. ఎవరైనా పంపిస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 20 లక్షల జరిమానా వేస్తుంది. అదే తప్పు మళ్లీ రిపీట్ అయితే శిక్ష ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.



Updated : 1 Aug 2023 8:22 PM IST
Tags:    
Next Story
Share it
Top