Home > వైరల్ > సాస్ బాటిల్ నాకిన బాలుడు.. రెస్టారెంట్కు 946కోట్ల నష్టం

సాస్ బాటిల్ నాకిన బాలుడు.. రెస్టారెంట్కు 946కోట్ల నష్టం

సాస్ బాటిల్ నాకిన బాలుడు.. రెస్టారెంట్కు 946కోట్ల నష్టం
X

ఓ బాలుడు రెస్టారెంట్కు వెళ్లాడు. నచ్చింది తిని వచ్చేయక.. తిక్క పనులు చేశాడు. ఆ బాలుడు చేసిన పని ఆ రెస్టారెంట్కు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మామూలు నష్టం కాదు ఏకంగా 946 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ ఘటన జపాన్లో జరిగింది. జపాన్‌లోని సుషీ రెస్టారెంట్కు ఓ బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. అయితే అతడు తన ముందు ఉన్న సాస్ బాటిల్ మూత తెరిచి నాకి మళ్లీ టేబుల్పై పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న టీ కప్పులను తీసుకుని నాలుకతో నాకాడు. తన వేలిని నోట్లో పెట్టుకుని అక్కడ ఉన్న వస్తులపై పెట్టాడు.

ఈ తతంగాన్ని అతడి స్నేహితుడు వీడియో తీశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాలుడి చేష్టలతో ఆ రెస్టారెంట్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. మొదట ఈ వీడియోను జనవరి 29న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఆ బాలుడిపై రెస్టారెంటు బ్రాంచ్ రూ.3.95 కోట్ల దావా వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ బాలుడు చేసిన పనికి సుషీ కంపెనీకి దాదాపు రూ.946 కోట్ల నష్టం వచ్చిందని దావాలో ఆరోపించారు.

ఈ ఘటనతో ఆ రెస్టారెంట్ బ్రాంచ్ అకిండో సుషిరో పలు చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాల సంఖ్య పెంచడం, కప్పులు, ఇతర వస్తువులపై ప్లాస్టిక్ కవర్లు ఉండేలా చర్యలు తీసుకుంది. తాను చేసిన తప్పును ఆ బాలుడు సైతం ఒప్పుకున్నాడు. తనపై వేసిన దావాను కొట్టేవేయాలని కోర్టును కోరాడు. ‘‘ నేను, నా ఫ్రెండ్ ప్రాంక్ వీడియో తీద్దామనుకున్నాం. ఆ వీడియోను థర్డ్ పార్టీకి పంపాం. దీంతో అది వైరల్ అయింది. నన్ను క్షమించండి’’ అని బాలుడు చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది.

Updated : 9 Jun 2023 10:12 PM IST
Tags:    
Next Story
Share it
Top