Jeff Bezos : ప్రేయసికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జెఫ్ బెజోస్
X
బిలినీయర్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఆయన మళ్లీ తన పేమను చాటుకున్నారు. త్వరలో పెళ్లాడబోతున్న తన ప్రేయసి కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దీని విలువ సుమారు 68 మిలియన్ డాలర్లు. భారత దేదశ కరెన్సీలో ఏకంగా రూ.560 కోట్లకు పైనే ఉంటుంది.
2018లో తన మాజీ భార్య మెకంజీ స్కాట్‌కు విడాకులిచ్చి అప్పటినుంచే సాంచెజ్‌తో జెఫ్ బెజోస్ డేటింగ్ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు.
గత మే నెలలో వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే, తాజాగా తన ప్రియురాలి కోసం బెజోస్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 68 మిలియన్ డాలర్ల విలువైన వాటర్‌ఫ్రంట్ మాన్షన్ కొన్నారు. పెళ్లి చేసుకునే సమయంలో దీనిని సాంచెజ్‌కు జెఫ్ బెజోస్ బహుకరించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ విలాసవంతమైన భవనం అమెరికా ఫ్లోరిడాలోని బిలియనీర్ బంగర్ ఎంక్లేవ్‌లో ఉంది. ఇది మేడ్ ఐలాండ్. ఇవాంక ట్రంప్, జారెడ్ కుష్నర్, టామ్ బ్రాడీ వంటి ప్రముఖుల ఇళ్ల కూడా ఇక్కడే ఉన్నాయి. MTM స్టార్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ మాజీ మేనేజర్ టులియా నుంచి ఈ ఖరీదైన మాన్షన్‌ను కొన్నారు బెజోస్. ఇక ఇది 9259 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందంట. దీనికి సొంతంగా మున్సిపాలిటీ, మేయర్ సహా పోలీస్ ఫోర్స్ కూడా ఉన్నాయి. ప్రేయసి కోసం ఇంత ఖరీదైన గిఫ్ట్‌ను జెఫ్ బెజోస్ కొనుగోలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
Jeff Bezos splurges on $68 million home in Florida's ‘Billionaire Bunker’ island for his bride-to-be fiancee Lauren Sanchez