అంబులెన్స్ ను ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్
పల్టీ కొట్టిన అంబులెన్స్
X
కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్ కుట్టి కాన్వయ్ ఓ అంబులెన్స్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ వ్యాన్ కిందపడడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొట్టారకరలోని పులుమన్ జంక్షన్ దగ్గర చోటు చేసుకుంది. ఈ ఆక్సిడెంట్ కు సంబంధించిన దృశ్యాలు ట్రాఫిక్ భద్రత సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఒక పక్కనుంచి వస్తున్న అంబులెన్స్(ambulance) చూసుకోకుండా అటుగా వస్తున్న మంత్రి కాన్వయ్ ఢీ కొట్టింది. అలాగే కంట్రోల్ కానీ ఆ వాహనం ఎదురుగా వస్తున్న బైక్ మీదకు దూసుకొచ్చింది. గమనించిన బైక్ నడిపే వ్యక్తి తన వేగాన్ని అదుపుచేసుకున్నాడు. ఫలితంగా పెద్ద ప్రమాదమే తప్పింది.
అంతేకాదు ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న పోలీసుకు కూడా తృటిలో ప్రాణహాని తప్పింది. కూడలిలో విధులు నిర్వహిస్తున్న పోలీసుపై పల్టీ పడిన అంబులెన్స్ దూసుకొచ్చింది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా చాలా ఘోరం జరిగేది. ఘటన జరిగిన తరువాత కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయినట్లు సమాచారం. కాన్వాయ్ దిగి మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని, గాయపడిన వారిని మంత్రి పరామర్శించి వెళ్లాడని సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Veerendra Prasad
వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.