Home > వైరల్ > రూ.45 వేలకే రోల్స్ రాయిస్ కారు.. కేరళ యువకుడి టాలెంట్

రూ.45 వేలకే రోల్స్ రాయిస్ కారు.. కేరళ యువకుడి టాలెంట్

రూ.45 వేలకే రోల్స్ రాయిస్ కారు.. కేరళ యువకుడి టాలెంట్
X

లగ్జరీ కార్లు అంటే మోజు పడేవారికి రోల్స్ రాయిస్ కార్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోట్ల రూపాయల విలువైన ఆ కారు సొంతం చేసుకోవాలంటే.. కేవలం ఇష్టమైన అరుదైన కలర్‌ కోసమే దాదాపు రూ. కోటి వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కేరళకు చెందిన ఓ యువకుడు(18) కేవలం రూ. 45 వేలతో రోల్స్‌ రాయిస్‌(Rolls Royce) కారును తయారుచేశాడు. తన వద్ద ఉన్న పాత మారుతి 800 కారును లగ్జరీ రోల్స్‌ రాయిస్‌ కారుగా మార్చాడు. కేవలం రూ. 45 వేల ఖర్చు చేసి ఈ ఘనత సాధించాడు. మారుతి 800(Maruti 800) కారును లగ్జరీ రోల్స్‌ రాయిస్‌గా మార్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడి టాలెంట్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కేరళకు చెందిన హదీఫ్‌(Hadeef) తన వద్ద ఉన్న మారుతి 800 కారును.. రోల్స్ రాయిస్ తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దాడు. కారు ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్ అమర్చాడు. బ్యానెట్‌పై 'స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ' అని రాసి జత చేయడంతో కారు ముందు భాగానికి మంచి లుక్‌ వచ్చింది. సాధారణ మారుతి 800 కారులోని ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్‌లో భారీ మార్పులు చేశాడే. కారు లోపల BMW కార్లలో ఉండే కొన్ని లగ్జరీ ఫీచర్లను జత చేశాడు. ఎక్స్‌టీరియర్‌ ప్యానెల్స్‌ను మెటల్ షీట్స్‌తో తయారు చేశాడు. హెడ్‌లైట్లు ,ఇండికేటర్లతో మారుతి కారును రోల్స్‌ రాయిస్‌ కారులా కనిపించేలా రూపొందించాడు. ఈ మోడిఫికేషన్స్‌ అన్నీ చేయడానికి హదీఫ్‌ కేవలం రూ. 45 వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నాడు. హదీఫ్‌ సాధారణ కారును రోల్స్‌ రాయిస్‌ కారుగా మార్చిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. కేవలం 5 రోజుల్లోనే 5 లక్షల వ్యూస్‌ని సంపాదించడం విశేషం.

Updated : 4 Oct 2023 8:26 AM IST
Tags:    
Next Story
Share it
Top