Home > వైరల్ > షారుఖ్కు బలవంతంగా ముద్దుపెట్టిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

షారుఖ్కు బలవంతంగా ముద్దుపెట్టిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

షారుఖ్కు బలవంతంగా ముద్దుపెట్టిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. పఠాన్ సినిమా ముందు వరకు కెమెరాలకు దూరంగా ఉన్న షారుఖ్.. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రజల ముందుకు వస్తున్నాడు. అలా అభిమానుల మధ్యకు వచ్చిన షారుఖ్ కు.. ఓ అభిమాని చేసిన పనికి కొంత ఇబ్బంది పడ్డాడు. దుబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తర్వాత అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ ను కలిశాడు. అక్కడ కొంతమంది షారుఖ్ ను హగ్ చేసుకోగా.. మరికొంతమంది ఫొటోలు తీసుకున్నారు.

ఈ క్రమంలో షారుఖ్ దగ్గరికి వచ్చిన ఓ యువతి.. మిమ్మల్ని ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగింది. దానికి షారుఖ్ సమాదానం ఇచ్చేలోపే.. తనను బలవంతంగా కింది లాగి ముద్దుపెట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. తర్వాత షారుఖ్ ముఖంలో కాస్త ఇబ్బంది కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది నువ్వు చాలా లక్కీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated : 14 Jun 2023 8:41 PM IST
Tags:    
Next Story
Share it
Top