ఓ వ్యక్తి షర్టులోకి దూరి రచ్చ చేసిన కింగ్ కోబ్రా..తర్వాత ఏం జరిగిందంటే.. వీడియో వైరల్
X
పాములంటే.. ఎంత పెద్ద వారైనా వణికిపోవాల్సిందే. పాము కనబడితే ఆమడ దూరం పరుగులు తీస్తారు. కింగ్ కోబ్రా లాంటి విష సర్పాలను చూస్తే ఇక అంతే సంగతి. గుండె ఆగినంత పనైపోతోంది. మరి అదే కింగ్ కోబ్రా మీ ఒంటిపై మెల్లగా కదులుతుంటే ఎలా ఉంటోదో ఊహించుకోండి. ఆ ఆలోచనే భయమేస్తోంది కదా.. అలాంటిది ఓ వ్యక్తి షర్ట్‌లోకి ఓ పాము ప్రవేశించింది. ఇక, పాము చొక్కాలో ఉన్నంతసేపు బాధితుడి భయంతో అల్లాడిపోయాడు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ప్రకారం పార్క్‌లో ఓ వ్యక్తి పడుకున్నాడు. ఈ క్రమంలో పెద్ద నాగుపాము అతడి చొక్కాలోకి ప్రవేశించింది. ఇంతలో అతడికి తెలివి రాగా పామును చూశి ఒక్కసారిగా బిక్కచచ్చిపోయాడు. ఏ మాత్రం కదలకుండా ఉండిపోయాడు. చొక్కా గుండీలు విప్పి పామును బయటకు పంపించేందుకు అక్కడి వారు సాయపడ్డారు. రెండు నిమిషాలు పాటు షర్ట్ లోపల అలా తిరిగిన పాము, మెల్లగా బయటకు తల పెట్టి.. అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. దీంతో అదృష్టం కొద్ది కింగ్ కోబ్రా కాటు నుంచి సదరు వ్యక్తి బయటపడ్డాడు.
Video | Large Cobra snake inside Man's shirt. Always Be careful while sleeping or sitting under trees. pic.twitter.com/ph5r7gwvyM
— MUMBAI NEWS (@Mumbaikhabar9) July 26, 2023