ఆకులు తిన్న మృగరాజు.. గడ్డి కూడా తింటాయట.. ఎందుకంటే..?
X
సింహం.. అడవికే రారాజు. మిగితా జంతువులను వేటాడి మరీ తింటాయి. మాంసం తప్ప ఏది తిన్నా దాన్ని కడుపు నిండదు. అటువంటి మృగరాజు అడవిలో ఆకులు తినడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింహం ఆకులు తింటున్న వీడియోను ఫారెస్ట్ అధికారి సుశాంత నంద ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. అది వైరల్గా మారింది. అసలు సింహాలు, పులులు ఆకులు, గడ్డి తింటాయా.. ఒకవేళ తింటే..ఎప్పుడు అవి తింటాయి అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఈ ప్రశ్నలకు సుశాంత నంద సమాధానాలు ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో సింహాల కడుపు నొప్పి వస్తుంది. ఇలాంటి సమయాల్లో అవి ఆకులు, గడ్డి తింటాయని.. అవి నొప్పిని తగ్గిస్తాయని నంద తెలిపారు. అలాగే తిన్న మాంసం జీర్ణం కానీ సమయాల్లో అవి ఆకులు, గడ్డి తింటాయట. అలా తినడం వల్ల వాటికి ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తోందట.
ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. సింహాలు గతిలేక గడ్డితినవు అనే డైలాగులు ఫేక్ అని ఈ వీడియోతో రుజువైందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సింహాలు మాంసం మాత్రమే తింటాయని చాలా మంది అనుకుంటారు. కానీ మాంసంతో పాటు కూరగాయలను కూడా తింటాయట. అయితే శాఖాహారం కంటే సింహాలు, పులులు మాత్రం ఎక్కువగా జంతువులను వేటాడి తినడానికే ఇష్టపడతాయని తెలుస్తోంది.
Yes. Lions sometimes eat grass & leaves. It may come as a surprise, but there are many reasons as why they eat grass & leaves.
— Susanta Nanda (@susantananda3) July 21, 2023
It helps them to settle stomach aches & in extreme cases provides water. pic.twitter.com/Crov6gLjWm