నీ మనోభావాలు ఇప్పుడేమయ్యాయ్.. సమంతకు కౌంటర్లు
X
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ శివ నిర్వాణ దర్వకత్వంలో వస్తున్న సినిమా 'ఖుషి' . తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాట రిలీజైంది. 'ఆరాధ్య' పేరుతో వచ్చిన ఈ పాటలో సమంత-విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. పిక్చరైజేషన్ దగ్గర నుంచి లిరిక్స్, ట్యూన్ వరకు ప్రతిదీ సూపర్ గా ఉన్నాయి. తాజాగా ఈ సాంగ్ లోని ఓ సీన్ కారణంగా సమంతపై ట్రోలింగ్ మొదలైంది.
విషయం ఏంటంటే.. 2014 లో వచ్చిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా "వన్ నేనొక్కడినే". సినిమా విడుదలకు ముందు పోస్టర్లు రిలీజ్ చేయగా.. అందులో 'హలో రాక్ స్టార్' అనే పాటకు సంబంధించి.. మహేష్ అడుగు జాడలను హీరోయిన్ కృతి సనన్ చేతులతో తాకుతున్న షాట్ ఉంటుంది. ఈ షాట్ కి సంబంధించిన పోస్టర్స్ పై సమంత ఆ సమయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అసహనం వెల్లడించారు. పోస్టర్ లోని పోజు, దాని అర్థం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని కామెంట్ పోస్ట్ చేశారు. పరిశ్రమలో అప్పుడే ఎదుగుతున్న సమంత మహేష్ బాబు వంటి స్టార్ ని తప్పుబట్టడం సంచలనమైంది. స్త్రీ పురుషులు సమానమే, హీరోయిన్ హీరో కాళ్ళను తాకుతున్నట్లు చూపడమేంటీ? అన్నట్లు ఆమె మాట్లాడారు. అప్పట్లోనే మహేష్ బాబు ఫ్యాన్స్ సమంత మీద మండిపడ్డారు. అది కేవలం సినిమా. పాటలో వచ్చే ఒక సన్నివేశం. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు.
ఈ వివాదం జరిగింది పదేళ్లు అవుతుండగా.. తాజాగా మహేష్ అభిమాని ఒకరు సమంతను బుక్ చేశాడు. ఖుషీ లోని తాజాగా విడుదలైన పాటలో విజయ్ దేవరకొండ సోఫాలో పడుకొని ఉండగా సమంత అతని కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న షాట్ ఉంది. విజయ్ దేవరకొండ తన కాలితో సమంత చేతిని తాకాడు. దీంతో ఆ అభిమాని ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టాడు. 'ఇంకా రిలీజ్ కానీ ఓ సినిమా పోస్టర్ చూశాను. నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి' అని తెలిపాడు. 'వన్ నేనొక్కడినే' పోస్టర్ ని, 'ఖుషి' ఫొటోని పక్కపక్కన బెట్టి ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు మహేష్ బాబు సినిమాను ఇదే విషయంలో తప్పుబట్టావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి? ఇది అమ్మాయిలను కించపరచడం కాదా? ఇప్పుడు నీ మనోభావాలు దెబ్బతినలేదా? అంటూ కౌంటర్లు వేస్తున్నాడు. చూస్తుంటే సమంత గతంలో తాను చేసిన కామెంట్ కి అడ్డంగా బుక్ అయ్యారని అర్థమవుతుంది.
No Hate But Sorry #Samantha
— Nikhil_Prince💫 (@Nikhil_Prince01) July 12, 2023
Karma Hits Back 🍌 pic.twitter.com/eTKTk3NQo8