Home > వైరల్ > ఇలా చేస్తే రోడ్డు ఈజీగా దాటొచ్చు...వీడియో వైరల్

ఇలా చేస్తే రోడ్డు ఈజీగా దాటొచ్చు...వీడియో వైరల్

ఇలా చేస్తే రోడ్డు ఈజీగా దాటొచ్చు...వీడియో వైరల్
X

సిగ్నల్ లేని రద్దీ ప్రదేశాల్లో రోడ్డు దాటడం కత్తిమీద సామే. చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్డు క్రాస్ చేయడానికి అవస్థలు ఎదుర్కొంటారు. కొన్ని సార్లు నిమిషాల కొద్ది వేచి చూసి అవతలి వైపుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఓ యువకుడు తన తెలివితేటలతో రోడ్డును సులభంగా దాటేశాడు. అతడు చేసిన పనికి వాహనాలన్నీ రోడ్డుపై నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే మీకు నవ్వాగదు.

రోడ్డు దాటేందుకు అతడు వికలాంగుడి అవతారం ఎత్తాడు. రోడ్డుపై కుంటుకుంటూ...చేతి సంజ్ఞలతో వాహనాలను ఆపుతూ అలా ముందుకు వెళ్లాడు. అతడిని నిజంగా వికలాంగుడు అనుకొని వాహనదారులు అందరూ తమ వెహికల్స్‌ను ఆపివేశారు. అతడు రోడ్డు దాటేవవరకు వేచి చూశారు. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది.

ఎప్పుడైతే అతడు రోడ్డు దాటేశాడో స్టైల్‌గా నడుచుకుంటూ పోయాడు. నిజానికి ఆ యువకుడు వికలాంగుడు కాదు.. రద్దీగా ఉన్న రోడ్డును దాటడానికి వికలాంగుడిగా నటించాడు. దీంతో అందరూ అతడి ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరు సూపర్ ఐడియా అంటూ కామెంట్ చేస్తే..మరికొందరు మాత్రం ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ వాదిస్తున్నారు.

Updated : 9 July 2023 8:35 PM IST
Tags:    
Next Story
Share it
Top