భయంతో నడిరోడ్డుపై ప్రియురాలిని వదిలి పరారైన లవర్
X
'నీ కోసం ప్రాణమిస్తా'.. 'నువ్వు లేక నేను లేను' అంటూ ఆ యువతి ప్రేమలోకి దించిన ఆ వ్యక్తి.. చిన్న ఆపద ఎదురుకాగానే ఆమెను వదిలేసి భయంతో పారిపోయాడు. దొంగల్ని చూసిన భయంతో నడిరోడ్డుపై ప్రియురాలిని వదిలి తన దారి తాను చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రియుడు ప్రవర్తించిన తీరుపై కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలో ఇంతకీ ఏముందంటే.. ఓ ప్రేమజంట చేతిలో చేయి వేసుకొని.. ప్రేమ కబుర్లు చెబుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. ఇంతలో బైక్ మీద వచ్చిన ఇద్దరు.. ప్రియురాలిని బ్యాగ్ ఇవ్వాలంటూ కత్తితో బెదిరించారు. అది చూసిన ప్రియుడు.. ప్రియురాలిని అక్కడే వదిలేసి.. వెనక్కి కూడా తిరిగిచూడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.
షాక్ అయిన ఆ అమ్మాయి.. తన దగ్గర ఉన్న బ్యాగును ఆ దొంగలకు ఇచ్చేసింది. వేరే దారి లేక, తప్పించుకోలేక.. ప్రియుడు పారిపోయిన వైపే చూస్తూ నిలుచుండి పోయింది. పాపం.. ఆ ప్రియురాలి పరిస్థితి చూసిన దొంగకి మనసు కరిగిపోయింది. ఆ అమ్మాయిని అతను వదిలేసి వెళ్లడం బాధ కలిగించింది. వెంటనే.. ఆమె దగ్గర కొట్టేసిన బ్యాగును.. తిరిగి ఆమెకే ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా..దీనిమీద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దొంగ బ్యాగును కొట్టేయడం కంటే పారిపోవడమే ఆమెను ఎక్కువగా బాధించిందని ఒకరు కామెంట్ చేశారు. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే తన శక్తికి మించి కాపాడాల్సింది పోయి తన దారి తాను చూసుకన్నాడని.. ధైర్యంలేని ఆ ప్రియుడి కంటే.. మనసున్న ఆ దొంగే బెటర్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE
— The Best (@Figensport) June 27, 2023