Home > వైరల్ > ప్రధాని పేరు చెప్పలేడని పెళ్లి రద్దు.. పెళ్లికొడుకు తమ్ముడితో..

ప్రధాని పేరు చెప్పలేడని పెళ్లి రద్దు.. పెళ్లికొడుకు తమ్ముడితో..

ప్రధాని పేరు చెప్పలేడని పెళ్లి రద్దు.. పెళ్లికొడుకు తమ్ముడితో..
X

ఉత్తరప్రదేశ్లో ఓ జంట పెళ్లి అట్టహాసంగా జరిగింది. పెళ్లి తర్వాత రోజు వధువు ఇంట్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరదలు, బావమరిదితో వరుడు మాటలు కలిపాడు. ఆ మాటలే అతడి పెళ్లిని పెటాకులు చేశాయి. పైగా అతడి తమ్ముడినే వధువు పెళ్లిచేసుకోవడంతో వరుడు బిత్తరపోయాడు. ఈ ఘటన ఘాజీపుర్ జిల్లాలో జరిగింది.

నసీర్ పుర్ గ్రామానికి చెందిన శివ శంకర్ అనే వ్యక్తికి, బసంత్ పట్టి గ్రామానికి చెందిన రంజన అనే యువతితో ఈ నెల 11న వివాహమైంది. పెళ్లివేడుకలో భాగంగా జూన్‌ 12న వధువు ఇంట్లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి మరదలు దేశ ప్రధాని ఎవరని వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేకపోయాడు.

వరుడికి ప్రధాని పేరు కూడా తెలీదా అంటూ బంధువులు అతన్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. రంజన కంటే అనంత్‌ వయసులో చిన్నవాడు. కాగా తమ కుటుంబాన్ని భయపెట్టి చిన్నకొడుకుతో వివాహం జరిపించారని వరుడి తండ్రి ఆరోపించారు.


Updated : 21 Jun 2023 8:42 AM IST
Tags:    
Next Story
Share it
Top