Home > వైరల్ > Chandrayaan 3 : వెలుగులోకి వచ్చిన మరో సీక్రెట్..చంద్రయాన్ 3 సక్సెస్‎కు కారణం ఇవే

Chandrayaan 3 : వెలుగులోకి వచ్చిన మరో సీక్రెట్..చంద్రయాన్ 3 సక్సెస్‎కు కారణం ఇవే

Chandrayaan 3 : వెలుగులోకి వచ్చిన మరో సీక్రెట్..చంద్రయాన్ 3 సక్సెస్‎కు కారణం ఇవే
X

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశం భారత్ చరిత్ర సృష్టించింది. జాబిల్లి ఉపరితల అన్వేషణలో ఇస్రో అద్భుత విజయం సాధించింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన మరుక్షణం దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. చందమామపై భారత జెండా ఎగరేసేందుకు శ్రమించిన ఇస్రో సైంటిస్టుల ఆనందానికి సైతం అవధుల్లేకుండా పోయింది. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని లక్ష్యాన్ని చేరుకుని అందరి చూపు భారత్‏పై పడేలా చేసింది ఇస్రో . శాస్త్రవేత్తల కృషికి దేశ, విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్ 3 విజయం వెనకాల ఉన్న మరో సీక్రెట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సక్సెస్ వెనకాల మసాలా దోశ, ఫిల‍్టర్‌ కాఫీ ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వినడానికి విచిత్రంగా, వింతగా ఉన్నప్పటికీ ఇదే వాస్తవమని కొన్ని నేషనల్ పత్రికలు కథనాలను ప్రచురిస్తోంది. తాజాగా ఇదే అంశంలో వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‎గా మారింది.

వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రకారం.. చంద్రయాన్‌ 3 సక్సెస్‏లో మసాలా దోశ, ఫిల్టర్‌ కాఫీలు ప్రముఖ పాత‍్ర పోషించిందని ఇస్రో శాస్త్రవేత్తల నుంచి సేకరించిన సమాచారంతో ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఈ విషయమై చంద్రయాన్‌ 3 ప్రాజెక్టు సైంటిస్ట్ వెంకటేశ్వర శర్మ తన అనుభవాలను తెలిపారు. " ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రయోగాన్నిఎలాంటి బ్రేక్ ఇవ్వకుండా నిర్విరామంగా చేసేందుకు శాస్త్రవేత్తలకు సహనంతో పాటు శక్తి కావాలి. అందుకే ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు శాస్త్రవేత్తలతో పాటు ఇస్రో స్టాఫ్‎కు మసాలా దోశ, ఫిల్టర్ కాఫీని సర్వ్ చేశాం. వీటి కారణంగానే అందరూ ఎంతో ఇష్టంగా అదనపు గంటలు చంద్రయాన్ 3 మిషన్ కోసం పనిచేశారు"అని శర్మ తెలిపారు.

చంద్రయాన్ 3 తో అంతరిక్ష రంగంలో అద్భుత విజయాన్నిసాధించింది ఇస్రో. జాబిల్లి ఉపరితలంపై సాఫ్ట్‎గా ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుణిపై అన్వేషణలో మునిగిపోయింది. ఇస్రోకు నిత్యం లేటెస్ట్ అప్‎డేట్స్ అందిస్తూ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేస్తోంది. ఎన్నో అగ్ర దేశాలకు సాధ్యం కాని ఘనతను భారత్‌ సొతం చేసుకుంది. ఈ క్రమంలోనే సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని చేపట్టబోతోంది.




Updated : 2 Sept 2023 10:27 AM IST
Tags:    
Next Story
Share it
Top