Home > వైరల్ > కూతురు లేచిపోయిందని పిండం పెడుతున్నారు..

కూతురు లేచిపోయిందని పిండం పెడుతున్నారు..

కూతురు లేచిపోయిందని పిండం పెడుతున్నారు..
X

ప్రేమ పెళ్లిళ్లు మన దేశంలో ఇప్పటికే నిషిద్ధమే. ముక్కూమొఖం ఎరగని వాడికిచ్చి పెళ్లి చేస్తే తమ బిడ్డ బతుకు ఏమవుతుందోననే భయంతో కొందరు, కులమతాల పట్టింపులతో మరికొందరు లవ్ మేరేజేలకు నో అంటున్నారు. కొందరు మాటల్లో చెప్పలేని ఘోరాలకు పాల్పడుతున్నారు. అబ్బాయిని చంపడం, అమ్మాయికి తమకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించడం, మాట వినపోతే సొంత కూతురని కూడా చూడకుండా ప్రాణం తీయడం వంటి ఎన్నో సంఘటనలను చూస్తున్నాం. నేరాలకు చేస్తే జైలు వెళ్తామనే భయంతో మరొకొందరు ఏదో రకంగా కసి తీర్చుకుంటున్నారు. కూతురు తమ మాట కాదని తనకు నచ్చిన ప్రియుడితో లేచిపోయిందంటూ ఓ కుటుంబం ఆమెకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. పిండప్రదాన కార్యక్రమాన్ని ఇంటికే పరిమితం చేయకుండా బంధుమిత్రులందరికీ తెలిపి, మా దుఃఖాన్ని పంచుకోండంటూ కార్డులు కూడా అచ్చేసి పంపుతోంది.

రాజస్తాన్‌లోని భీల్వాడా జిలా రతన్‌పురా గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంటోంది. ప్రియా జాట్‌ అనే యువతి ఎవరినో ప్రేమించి ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఆమో కోసం ఊరంతా వెతికారు. చుట్టుపక్కల కూడా వాకబు చేశారు. ప్రియుడితోనే వెళ్లి ఉంటుందని హమీర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా ప్రియుణ్ని విడిచిపెట్టి వచ్చే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పింది. తమను కాదను వెళ్లిపోయిన కూతురు తమకు లేనట్టేనని శ్రాద్ధానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రియా జాట్ జూన్‌ 1న స్వర్గస్థురాలైందని, జూన్‌ 13న తద్దినానికి వచ్చి తమను ఓదార్చి పోవాలని కార్డులు అచ్చేసి పంచిపెడుతున్నారు. మరీ ఇంత అన్యాయా అని కొందరు నెటిజన్లు అంటుంటే, ఆ నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన బిడ్డ కాదనే వెళ్లిపో ఎంత బాధగా ఉంటుందని మరికొందరు అంటున్నారు.


Updated : 5 Jun 2023 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top