Home > వైరల్ > ధోని బర్త్ డే సెలబ్రేషన్స్...చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్

ధోని బర్త్ డే సెలబ్రేషన్స్...చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్

ధోని బర్త్ డే సెలబ్రేషన్స్...చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో వైరల్
X

జూలై 7, శుక్రవారం భారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టినరోజు. దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన ఆటగాడి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. మాజీ క్రికెటర్లు ధోనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోని బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా షేక్ అయ్యింది. రోజంతా ధోనినే ట్రెండింగ్ లో ఉన్నాడు. ధోని వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో తుఫానును తలపించాయి.

ఒకపక్క అభిమానులు తన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తే..ధోని మాత్రం చాలా సింపుల్‎గా జరుపుకున్నారు. తనకిష్టమైన పెంపుడు కుక్కల మధ్య ధోనీ కేక్ కట్ చేశాడు. అనంతరం కేక్ ముక్కలను కుక్కలకు తినిపించి తర్వాత తాను తిన్నాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో ధోని పోస్ట్ చేశాడు. తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

సోషల్ మీడియాకు ధోని దాదాపు దూరంగా ఉంటాడు. అతని అభిమానులు కూడా దానికి అలవాటు పడ్డారు. కాని పుట్టిన రోజు ధోని వీడియో షేర్ చేయడంతో ఆశ్చర్యపోయారు. బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ అంటూ పొంగిపోతున్నారు. ధోని సింప్లిసిటీ, హ్యూమనిటీని చూసి ఆశ్చర్యపోతున్నారు.


Updated : 8 July 2023 9:17 PM IST
Tags:    
Next Story
Share it
Top