ఆ సింగర్‌తో అనిరుధ్ డీప్ లవ్..కన్ఫార్మ్ చేయాలంటూ ఫ్యాన్స్ ట్వీట్స్
X
అనిరుధ్ ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్‌గా తన మెస్మరైజింగ్ ట్యూన్స్‌తో తమిళనాడుతో పాటు టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేస్తున్నాడు. వరల్డ్ వైడ్‌గా అనిరుధ్ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. అతన నుంచి వచ్చిన ఏ పాటైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. ధనుష్ సినిమాలోని వై దిస్ కొలవెరి మొదలు ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పదేళ్లలో ఎన్నోపాటలకు తనదైన సంగీతాన్ని అందించి ప్రాణం పోశాడు. ఇండస్ట్రీలోని సీనియర్లకే గట్టిపోటి ఇచ్చాడు. తెలుగులో పవన్ కల్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి'తో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు అనిరుధ్. ఈ సినిమా హిట్ కాకపోయినా అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్టుగా అనిరుధ్ ఎన్టీఆర్ సినిమా 'దేవర' కు మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తమిళనాట అనిరుధ్ పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్స్‌తో రిలేషన్స్‌లో ఉన్నాడనే రూమర్స్ ఇతనిపై ఎక్కువగానే వస్తుంటాయి. అప్పట్లో సుచీ లీక్స్ పేరుతో కోలీవుడ్‌లో లీకైన కొన్ని ఫోటోల్లో అనిరుధ్ ఫోటోలు బయటపడ్డాయి. అందులో హీరోయిన్ ఆండ్రియాతో లిప్ లాక్ పెట్టుకుంటున్న ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఒక రకంగా ఈ ఫోటో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపింది.
లేటెస్టుగా అనిరుధ్‌ను మరో వివాదం చుట్టుముడుతోంది. విజయ్ 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు' సాంగ్ పాడి ఫేమస్ అయిన సింగర్ 'జోనితా గాంధీ'తో అనిరుధ్ ప్రేమలో ఉన్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది. గత కొన్నిరోజులుగా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది. కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ మూవీ 'విక్రమ్' నుంచే వీరిద్దరూ డీప్ లవ్‌లో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు త‍్వరలోనే వీరి ప్రేమకు శుభం కార్డు పడనుందని, ధనుష్, జోనితా పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే అక్కడ జోనితా వాలిపోతోందట. అయితే తమపై ఇంతలా రూమర్స్ వస్తున్నా ఈ జోడీ మాత్రం ఈ న్యూస్‌ను ఖండించింది లేదు. అలాగని ఒప్పుకోనూలేదు. ఇప్పటికైనా నోరు విప్పు తమ లవ్ స్టోరీ చెప్పాలని ఫ్యాన్స్ ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు.