Home > వైరల్ > 'ఇలాంటివి అవసరమా'.. హార్దిక్ 'కపుల్' ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్​..

'ఇలాంటివి అవసరమా'.. హార్దిక్ 'కపుల్' ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్​..

ఇలాంటివి అవసరమా.. హార్దిక్ కపుల్ ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్​..
X

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య-నటాషా దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. నెటిజన్లు ఈ ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారు. ​ హార్దిక్ పాండ్య ప్రస్తుతం తన భార్య,పిల్లలతో కలసి థాయ్​లాండ్ ట్రిప్​లో ఫుల్ ఎంజాయ్​ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలను ప్రస్తుతం హార్దిక్ పాండ్య భార్య నటాషా సోషల్​మీడియాలో షేర్ చేస్తోంది. ఈ పిక్స్​లో ఇద్దరు బాగా సన్నిహితంగా కనిపించారు. తాజాగా ఆమె షేర్​ చేసిన ఫొటోలను నెటిజన్లు తెగ ట్రోల్​ చేస్తున్నారు. పబ్లిక్​గా అవసరమా ఇలాంటివి అని అంటున్నారు.

'ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు?' అంటూ నటాషా డ్రెస్సింగ్‌ తీరును తప్పుపడుతున్నారు. అయితే హార్దిక్ పాండ్య​ అభిమానులు మాత్రం.. 'వాళ్లు భార్యాభర్తలు. ఎలా ఉంటే మీకేంటి?', 'నటాషా డ్రెస్సింగ్​ స్టైల్​పై మీకు అభ్యంతరాలేమిటి?', 'మీ పని చూసుకోండి' అంటూ ట్రోల్​ చేసే వారికి తిరిగి కౌంటర్​లు ఇస్తున్నారు. కాగా, జులై 12 నుంచి ప్రారంభంకానున్న వెస్టిండీస్‌ టూర్‌తో హార్దిక్‌ పాండ్య మళ్లీ తన ప్రొఫెషనల్​ లైఫ్​లో బిజీ కానున్నాడు.


Updated : 30 Jun 2023 9:40 AM IST
Tags:    
Next Story
Share it
Top