‘కళ్లకు నీళ్లొస్తున్నాయా..! మీ తాత వల్లే మాకీ దుస్తితి పట్టింది’.. కేసీఆర్ మనుమడిపై ట్రోలింగ్
X
సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను.. రూ. కోటి వ్యయంతో నిర్మించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా స్కూల్ ప్రారంభించి.. ఆ స్కూల్ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశాడు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కూల్ కు కంట్రిబ్యూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. హిమాన్షు చేసిన పనికి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన హిమాన్షు.. ‘నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్స్ చూడటం ఇదే మొదటిసారి. ఈ స్కూల్ ను చూసినప్పుడు నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని అప్పుడే నిర్ణయించుకున్నా’అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఆ మాటలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అతని మాటలు విన్నవాళ్లు ట్రోల్ చేస్తున్నారు.
‘తొలిసారి వచ్చినప్పుడు కన్నీళ్లు వచ్చాయా. ఆడపిల్లలకు బాత్రూంలు లేవు. స్కూల్స్ మెట్లు కూడా సరిగా ఉండవు’అని అన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. ‘పదేళ్లుగా మీ తాత సీఎం, తండ్రి మంత్రిగా ఉండి.. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింద’ని ట్రోల్ చేస్తున్నారు.