ఒక్క పేరు కూడా సక్కగ పలకలే.. టీజీ వెంకటేశ్‌పై ట్రోలింగ్
X
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా నిన్న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. అంటే ఆయనేదో అదిరిపోయే స్పీచ్ ఇచ్చారనో, లేదంటే రేమండ్స్ సూట్‌లో వచ్చారనో కాదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కు.. ఈ మాజీ రాజ్యసభ సభ్యుడు కజిన్ కావడంతో ఆయన కూడా ఫంక్షన్ కు వచ్చారు. ఇక స్టేజ్ ఎక్కి మైక్ అందుకొని.. ఆయన స్పీచ్ విన్నాక పవన్ ఫ్యాన్స్ బిత్తరపోయారు. ఎవరీయన అంటూ గోల చేశారు.
సినిమాలో పనిచేస్తున్న నటులు, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ పేర్లు ఇష్టం వచ్చినట్లు పలికారు టీజీ వెంకటేశ్. ఆయనకు బ్రో మూవీ నటులు, సాంకేతిక నిపుణుల పేర్ల మీద కనీస అవగాహనా లేదు. వేదికపై ఒక్కరి పేరు సరిగా పలకలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని తమన్నా అన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్ ని ధర్మ తేజ అన్నారు. ఇక కేతిక శర్మ అనబోయి కీర్తి శర్మ అన్నారు. దర్శకుడు సముద్రఖని పేరు సముద్రాలు అన్నారు. ఆయన స్పీచ్ దెబ్బకు వేదిక మీదున్న యాంకర్ సుమకు నవ్వు ఆగలేదు. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున గోల చేశారు. ఆయన స్పీచ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి.
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ బ్రో. ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్. ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రతౌలా స్పెషల్ సాంగ్ చేశారు.
బ్రో సినిమా గురించి పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడి బుక్ అయిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. pic.twitter.com/RD8nR5Lmou
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2023