Home > వైరల్ > నైటీలు, లుంగీలతో బయటకు రావొద్దు..!

నైటీలు, లుంగీలతో బయటకు రావొద్దు..!

నైటీలు, లుంగీలతో బయటకు రావొద్దు..!
X

సౌకర్యవంతమైన ఫీలింగ్ కోసం మగవాళ్ళు లుంగీలు, ఆడవాళ్లు నైటీలు ధరిస్తారు. ఇంట్లో ఉన్న సమయంలో వీటితోనే ఉండేందుకు ఇష్టపడతారు. ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో కూడా లుంగీలు, నైటీలతో తిరుగుతున్నారు. అయితే గ్రేటర్ నోయిడాలోని ఓ హౌజింగ్ సొసైటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరు బయట, కామన్ ఏరియాల్లో లుంగీలు, నైటీలతో కనిపించొద్దంటూ షరతులు విధించింది. ఈ షరతులను పలువురు తీవ్రంగా విమర్శిస్తుంటే మరికొందరు సమర్థిస్తున్నారులుంగీలు, నైటీలు ఇంట్లో వేసుకునేవి అని.. బయట వాటితో తిరగొద్దంటూ హిమ్‌సాగర్‌ అపార్టుమెంట్‌లోని రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సూచనలు చేసింది. పార్కింగ్ ఏరియాలోకి వెళ్లినప్పుడు లుంగీలు లేదా నైటీలు వేసుకుని వెళ్ళరాదని తెలిపింది. నిబంధనలకు లోబడి ఉండాలని అపార్ట్‌మెంట్ వాసులకు విజ్ఞప్తి చేసింది. జూన్‌ 10న జారీ చేసిన ఈ సర్క్యులర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇలా వ్యక్తిగత విషయాలపైనా పోలీసింగ్ చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హౌజింగ్ సొసైటీ యాజమాన్యం తీరుపై పలువురు మండిపడుతున్నారు.

దీనిపై అపార్టుమెంట్‌ ప్రెసిడెంట్‌ సీకే కల్రా స్పందించారు. అపార్టుమెంట్‌ పరిసరాల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించి కొందరు వ్యక్తులు నిత్యం యోగా చేస్తున్నారని.. వాటిపై ఫిర్యాదులు వచ్చినందునే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎవరిపై వివక్ష చూపడం లేదని వివరించారు. మొదట డైరెక్ట్‌గా చెప్పిచూశామని ఎవరిలో మార్పు రాకపోవడంతోనే సర్క్యూలర్ జారీ చేసినట్లు స్పష్టం చేశారు.


Updated : 14 Jun 2023 4:36 PM IST
Tags:    
Next Story
Share it
Top