వీల్‌ఛైర్ లేక.. కొడుకును స్కూటీపై మూడో ఫ్లోర్కు తీసుకెళ్లిన తండ్రి..
X
అతనో న్యాయవాది.. తన కొడుకు కాలుకు గాయమైంది. ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఎంత ట్రై చేసిన వీల్ చైర్ లభించలేదు. దీంతో తన స్కూటీపైనే మూడో ఫ్లోర్కు తీసుకెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోట జిల్లాలో జరిగింది. కోట ప్రాంతానికి చెందిన న్యాయవాది మనోజ్ జైన్ కుమారుడి కాలుకు ఇటీవల గాయమైంది. దీంతో కట్టు మార్పించేందుకు కోటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి కొడుకుని తీసుకెళ్లాడు. వీల్ చైర్ ఇవ్వాలని సిబ్బందిని కోరాడు. అయితే వీల్ చైర్స్ లేవని ఆస్పత్ర సిబ్బంది చెప్పారు.
ఈ నేపథ్యంలో తన స్కూటీపై మూడో ఫ్లోర్ కు తన కొడుకును తీసుకెళ్లాడు. స్కూటీతోనే ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కి.. థర్డ్ ఫ్లోర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అదే స్కూటీపై ఆర్తోపెడిక్ వార్డుకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఆ తర్వాత అదే స్కూటీపై ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే వార్డ్ ఇంచార్జ్ అడ్డుకున్నారు. ఆస్పత్రిలోకి స్కూటీ ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నిస్తూ కీ తీసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. వీల్ చైర్ లేకపోవడంతో స్కూటీపై తీసుకొచ్చానని.. దీనికి సిబ్బంది కూడా అనుమతించారని స్పష్టం చేశారు.
అయితే వార్డు ఇంచార్జ్ కీ ఇవ్వకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. ఈ ఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది నెట్టింట వైరల్గా మారింది. కాగా వీల్‌చైర్స్‌ను అందుబాటులో ఉంచుతామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు
#Rajasthan: Shocking video surfaced from Kota's hospital. The lawyer climbed to the third floor by scooty. #Viralvideo #India pic.twitter.com/qZ4l9zzovV
— Akshara (@Akshara117) June 17, 2023