Home > వైరల్ > ఓలాలో కుక్కకు జాబ్..ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ

ఓలాలో కుక్కకు జాబ్..ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ

ఓలాలో కుక్కకు జాబ్..ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ
X

టైటిల్‌ చూసి కాస్త షాక్ అయ్యుంటారు కదా. కానీ అది నూటికి నూరు శాతం నిజం. డిగ్రీలు చేసి, పీజీ పట్టా పుచ్చుకున్న వారికే సరైన ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మిగులుతున్న రోజులివి. అలాంటిది ఏ డిగ్రీ తీసుకోకుండానే అసలు చదువుకోకుండానే ఓ పెద్ద కంపెనీలో జాక్ పాట్ లాంటి ఉద్యోగాన్ని కొట్టేసింది బిజిలీ అనే ఓ కుక్క . అందరినీ అవాక్కు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ భవశ్ అగర్వాల్ బిజిలీకి జాబ్ ఇచ్చినట్లు అనౌన్స్ చేశారు. సరదాగా కుక్క ఐడీ కార్డును తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా కుక్కకు జాబా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఓలాలో ‘బిజిలీ’ అనే కుక్కకు కొత్తగా ఉద్యోగం ఇచ్చారు సంస్థ సీఈవో భవీశ్‌ అగర్వాల్. అందుకు సంబంధించిన ఐడీ కార్డును ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. హిందీలో ‘బిజిలీ’ అంటే విద్యుత్ అని అర్థం వస్తుంది. ఈ కుక్కకు ‘440 వీ’గా ఐడీ సంఖ్యను ఇచ్చారు. ఇక దని బ్లడ్ గ్రూప్‌ ‘PAW +ve’ అని ఐడీ మీద ముద్రించారు. దానిపై ఓలా ఎలక్ట్రిక్స్‌ బెంగళూరు ఆఫీస్ అడ్రస్‎ను ముద్రించారు. కొరమంగళ బ్రాంచ్ లో ఈ కుక్క పనిచేస్తుందని డీటైల్ గా చెప్పారు. దీనికి కొంత జోడిస్తూ బిజిలీని ‘స్లాక్’ ద్వారా సహోద్యోగులు కమ్యూనికేట్‌ చేయొచ్చని తెలిపారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు బిజిలీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. కొంత మంది బిజిలీని యానిమేటెడ్ క్యారెక్టర్‌ ‘బోల్ట్‌’తో కంపేర్ చేశారు.

Updated : 1 Aug 2023 10:10 PM IST
Tags:    
Next Story
Share it
Top