Home > వైరల్ > వావ్ ఐడియా అదిరిపోలా..క్షణాల్లో ఆమ్లెట్ రెడీ...

వావ్ ఐడియా అదిరిపోలా..క్షణాల్లో ఆమ్లెట్ రెడీ...

వావ్ ఐడియా అదిరిపోలా..క్షణాల్లో ఆమ్లెట్ రెడీ...
X

ఎగ్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఒక్కోక్కరు ఒక్కోలా దీనిని తింటుంటారు. అందులో ఆమ్లెట్ అంటే చాలా మందికి ఫేవెరెట్ డిష్‎గా ఉంటుంది. ఎగ్ ప్రియులు రకరకాలుగా ఆమ్లెట్ వేసుకుని దాని టేస్ట్‎ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఆమ్లెట్ వేసుకోవాలంటే మాత్రం కొంచెం ప్రిపరేషన్ అవసరం. గుడ్డు కొట్టాలి, ఉప్పూ, కారం వేయాలి, ఉల్లి తరగాలి, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి ఇలా ఓ ఆమ్లెట్ వేసుకోవాలంటే దాదాపు ఓ 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. అలా వెయిట్ చేస్తే కానీ రుచికరమైన ఆమ్లెట్ రెడీ అవదు. అందుకే ఆ బాధలేమీ లేకుండా క్షణాల్లో ఆమ్లెట్ రెడీ అయ్యే రెసిపీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఎగ్ లేకుండానే హాయిగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఏంటి ఎగ్ లేకుండా ఆమ్లెటా ? అదెలా అనుకుంటున్నారా ఈ స్టోరీ చూసేయండి మరి.

కేరళ రామనట్టుకరకు చెందిన అర్జున్ నాయర్‌ ఎగ్ లెస్ ఆమ్లెట్ రెసిపీని మార్కెట్‎లో విడుదల చేశాడు. తన నైపుణ్యాన్ని వినియోగించి గుడ్డు లేకుండా ఆమ్లెట్ వేసుకునే రెసిపీని కనిపెట్టి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఎంతో ఈజీగా ఆమ్లెట్ వేసుకోవచ్చని తాను తీసుకువచ్చిన ఇన్‏స్టంట్ ఆమ్లెట్ పౌడర్ ద్వారా నిరూపించాడు. అందుకే అర్జున్ నాయర్‎ను ‘ఆమ్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు.

ఎగ్ వాడకుండా ఆమ్లెట్ తయారు చేయాలన్నది అతని టార్గెట్. అది ఎలా సాధ్యపడుతుందోనని విపరీతంగా ఆలోచించాడు. దాదాపు 3 ఏళ్లకు పైగా రీసర్చ్ తో పాటు ప్రయోగాలు చేశాడు. ఎంతో డబ్బును ఖర్చు చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించి ఎగ్ లెస్ ఆమ్లెట్‎ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాడు.

రూ.2 కోట్ల రూపాయల బడ్జెట్‎తో ‘ధన్స్ డ్యూరబుల్’ అనే పేరుతో ఓ కంపెనీని స్ధాపించాడు. రూ.5 నుంచి రూ.100ధరలో ప్యాకెట్లను ఇంట్రడ్యూజ్ చేశాడు. అయితే ఏదో ఒక్క ఫ్లేవర్ తో ఆమ్లెట్ పౌడర్ అమ్మడం లేదు. పిల్లలు ఇష్టపడే విధంగా కిడ్స్ ఆమ్లెట్, కాస్తా మసాలా కావాలనుకునేవారికి మసాలా ఆమ్లెట్, ఇక ఎగ్ బుర్జీ ఇలా కొత్త కొత్త ఫ్లేవర్స్‌ని వినియోగదారులకు పరిచయం చేశాడు. ఈ పౌడర్‎ను ఒక్కసారి కొనుగోలు చేస్తే దాదాపు నాలుగు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు.

Updated : 2 Aug 2023 6:11 PM IST
Tags:    
Next Story
Share it
Top