ఆ పాకిస్తాన్ అమ్మాయి పెళ్లాడింది తండ్రిని కాదు, టీచర్‌ను!
X
పాకిస్తాన్‌లో యువతి తన సొంత తండ్రినే పెళ్లాడినట్లు ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. పాకిస్తాన్‌లో అబ్బాయిలు కరువయ్యారా, ఆమె చేసుకుంటానంటే మాత్రం అతనెలా బుద్ధిలేకుండా ఎలా ఒప్పుకున్నాడు అని నెటిజన్లు తిడుతున్నారు. ఆమె పెళ్లాడ్డానికి ఆమె చెప్పిన కారణాలు విని తల పట్టుకుంటున్నారు!! అయితే వాళ్లిద్దరూ తల్లీకూతుళ్లు కాదని, గురువు, శిష్యురాలు అని తెలిసింది.
Daughter justifying being 4th wife of her father pic.twitter.com/7vOrjGuBDD
— Hemir Desai (@hemirdesai) July 6, 2023
ఆమె వివరణ ఇదీ..
‘‘నా పేరు రబియా. మామూలుగా నాలుగో కూతురుకు ఈ పేరు పెట్టుకుంటారు. నా పేరూ రబియానే. కానీ నేను రెండో కూతురినే. నా పేరుకు న్యాయం చేస్తూ ఎలాగోలా నాలుగోదాన్ని కావాలనుకున్నా. దీనికి పరిష్కారం ఏమిటని బాగా ఆలోంచి ఇతనికి నాలుగో భార్యను అయ్యాను’’ అని అమ్మాయి చెప్పుకొచ్చింది. వరుడు పెద్ద వయసువాడు కావడంతో ఆమె తండ్రినే పెళ్లి చేసుకుందని జనం అపోహ పడ్డారు. వీరి పెళ్లి 2001లోనే జరిగిందని, వయోభేదం వల్ల అప్పుడూ వార్తల్లోకి ఎక్కారని పాక్ మీడియా చెబుతోంది.