భారత్ మాతాకు జై అంటున్న సీమా హైదర్..ఫోటోలు, వీడియోలు వైరల్
X
పబ్జీ ఆటలో పరిచయమైన తన ప్రియుడు సచిన్ కోసం పాకిస్థాన్ బార్డర్ దాటి వచ్చిన మహిళ సీమా హైదర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. పాకిస్థానీ మహిళ అయినప్పటికీ భారత్ మాతాకు జై కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ జెండా రంగు చీరను కట్టుకుని భుజాన జెండాను కప్పుకుని హిందుస్థాన్ హే మేరా అంటూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరినీ షాక్‌కు గురిచేసింది. ఓ పాక్ మహిళ భారత్ మాతాకి జై కొట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతోంది. నోయిడాలో జరిగిన ఈ కార్యక్రమంలో తన ప్రియుడి సచిన్, పిల్లలు, లాయర్‌తో కలిసి పాక్ మహిళ సీమా హైదర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంది. కుటుంబమంతా కలిసికట్టుగా త్రివర్ణ పతాకాన్ని తమ ఇంటిపై ఎగరవేశారు. ఈ వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పబ్జీ ప్రియుడు సచిన్‌ను పెళ్లి చేసుకుని తాను ఇండియన్‌గా మారిపోయానని సీమా హైదర్ అంటోంది. భారత్ మాత తనకు కూడా తల్లేనని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇకపై తాను పాకిస్థాన్‌కు వెళ్లబోనని క్లారిటీ ిచ్చింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ సీమా హైదర్ రీసెంట్గా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకుంది.
సచిన్, సీమా హైదర్ ప్రేమ వ్యవహారం అటు పాక్ , ఇటు ఇండియాలో చాలా ఫేమస్ అయ్యింది. వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. వీరి లవ్ స్టోర్ ఇన్స్పిరేషన్తో ఫిల్మ్ మేకర్స్ సినిమా కూడా నిర్మిస్తున్నారు.
‘కరాచీ టు నోయిడా’ అనే సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే నోయిడాకు చెందిన ప్రొడ్యూజర్ అమిత్ జానీ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో కథానాయకిగా సీమాను నటించాలని కోరగా ఆ ఆఫర్‌ను సీమా నిరాకరించినట్లు సమాచారం. ఇదే క్రమంలో సీమాతో సినిమాలు తీసే ప్రయత్నం ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన హెచ్చరికలు జారీ చేసింది.
सीमा हैदर ने लगाए पाकिस्तान मुर्दाबाद के नारे, लगाए हिंदुस्तान जिंदाबाद के नारे
— News24 (@news24tvchannel) August 14, 2023
◆ वीडियो हुआ सोशल मीडिया पर वायरल
Seema Haider | #SeemaHaider pic.twitter.com/1q6qAlWC5V