ఘనంగా పరిణీతి, రాఘవ్ చద్దా వివాహం...ఫొటోలు వైరల్
X
"బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం అంగరంగవైభవంగా జరిగింది". రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులతో పాట పలువురు సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు హాజరయ్యారు. మూడు రోజుల పాటు వీరి పెళ్లి వేడుక కన్నులపండుగగా జరిగింది.
సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో పరిణీతి, రాఘవ్ల రిసెప్షన్‌ను జరగనుంది. ఈ కొత్త జంట వచ్చే నెలలో ఢిల్లీలో మరో రిసెప్షన్ నిర్వహంచనుంది. పొలిటికల్ లీడర్స్, సినీ సెలబ్రిటీల కోసం ఢిల్లీలో రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. నవ వధువు పరిణీతి తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పరిణీతి చోప్రా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను పంచుకుంది. ఈ చిత్రాల్లో వధూవరులు ఇద్దరూ ఎంతో అద్భుతంగా కనిపించారు. చిరునవ్వుతో పరిణీతి, రాఘవ్ చద్దా కనిపిస్తూ అంరిని మెస్మరైజ్ చేశారు. కాళ్లకు మెట్టెలు పెట్టే ఫోటో, వరమాల ధరిస్తున్నప్పుడు తీసిన పిక్, రాఘవ్ చద్దా తనను ముద్దు పెట్టుకున్న ఫోటోలను వరుసగా రిలీజ్ చేసింది. ఈ ఫోటోలతో పాటుగా అద్భుతమైన క్యాప్షన్‌ను జోడించింది పరిణీతి. " ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నా..ఎట్టకేలకు మిస్టర్ అండ్ మిసెస్ కావడం ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నా, ఒకరిని ఒకరం విడిచి బ్రతకలేం. మా ప్రాయాణం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది పరిణీతి.
పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా లండన్‌లో మొదటిసారి మీట్ అయ్యారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా కలిసి చదువుకున్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ సంవత్సరం మార్చి నుంచి పరిణీతి, రాఘవ్ పెళ్లి రూమర్స్ బాగా వినిపించాయి. తాజాగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2022లో 33 ఏళ్ల వయస్సులోనే రాఘవ్ చద్దా పంజాబ్ నుంచి అతి చిన్న వయస్కుడైన ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. పరిణీతి చోప్రా 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.