Home > వైరల్ > వర్షాకాలం కదా.. నమ్మండి.. ఇంటికి ఇలా పేడ రాస్తే పిడుగు పడదు..!

వర్షాకాలం కదా.. నమ్మండి.. ఇంటికి ఇలా పేడ రాస్తే పిడుగు పడదు..!

వర్షాకాలం కదా.. నమ్మండి.. ఇంటికి ఇలా పేడ రాస్తే పిడుగు పడదు..!
X

భారతంలో వింత ఆచారాలు, సంప్రదాయాలకు కొదవ లేదు. ఎన్ని జాతులు, కులాలు ఉన్నాయో.. అన్ని రకాల ఆచార, సంప్రదాయాలు కనిపిస్తాయి. కొన్ని సైన్స్ కు అంతు చిక్కనివి ఉంటే.. మరికొన్ని మూడ నమ్మకాల్లా మిగిలిపోతుంటాయి. ఆధునిక యుగంలో కూడా ఆ మూడాచారాల ముసుగులో కొన్ని గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. సమాజానికి దూరంగా, అడవుల్లో కొన్ని జాతులు బతుకుతున్నాయి. గ్రామాలు కూడా నగరాల్లా మారుతుంటే.. కొన్ని చోట్ల మాత్రం విచిత్రమైన నమ్మకాల్ని కలిగి ఉన్నారు. ఛత్తీస్గఢ్ లోని సూరజ్పూర్ తాలూకా కొలియారి గ్రామ ప్రజలు నేటికీ ఇలాంటి మూడాచారాల్లో జీవిస్తున్నారు. వర్షాకాలంలో పిడుగు పాట్లకు గురికాకుండా తమ ఇళ్లకు.. ఆవు పేడతో రక్షణ వలయాలు ఏర్పాటు చేసుకుంటారు.

అంతేకాకుండా పిడుగు పాటుకు గురైన వ్యక్తికి కూడా ఆపు పేడను పూస్తారు. ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఆ గ్రామంలో.. పేడ ఉన్న చోట పిడుగు పడదని గట్టి నమ్మకం. దానికి గ్రామస్తులంతా అనుగుటణంగా నడుచుకుంటారు. దాంతోపాటు ఏ శుభకార్యం జరిగినా ఆ ఇంటి ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరింస్తారు. ఇంటి చుట్టూ మనిషి ఆకారంలా ఉండే బొమ్మను ఆవు పేడతో గీస్తారు. దీనివల్ల పిడుగు నుంచి తప్పించుకోవడమే కాకుండా.. పాములు, తేళ్లు, కీటకాల నుంచి ఇంటికి రక్షణ ఉంటుందని నమ్ముతున్నారు.



Updated : 8 Aug 2023 11:54 AM IST
Tags:    
Next Story
Share it
Top