PIB Fact Check: : రూ.30 వేలకు మించి ఉంటే బ్యాంకు అకౌంట్ క్లోజ్...క్లారిటీ !
X
సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. వాటిలో సగం నిజమైతే..మరికొన్ని ఫేక్ ప్రచారాలు. అయితే ఏది రియల్ అనేది నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయంలో పడిపోతారు. కొన్ని ఆందోళనకు గురిచేసే వార్తలు ఇటీవల కాలంలో వస్తున్నాయి. తాజాగా బ్యాంక్ అకౌంట్స్‌కు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాతాదారులు కంగారు పడ్డారు. కొంతమంది ఏకంగా నిర్ధారించుకునేందుకు బ్యాంకులకు వెళ్లారు.
అయితే వైరల్ అవుతన్న ఆ వార్తలో నిజంలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. ఆర్బీఐ ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదని PIB Fact Checkలో తేలింది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పీఐబీ ఇండియా చేసిన ట్వీట్‌లో ఏం ఉందంటే.."రూ.30 వేలకు మించి ఉంటే ఆ ఖాతా మూసివేయబడుతుందన్న వార్త అవాస్తవం. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పింది. దీంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9