Home > వైరల్ > ఫేక్ లీడర్లు.. మహిళలపై అభిమానం చూపుతున్నారు.. పూనమ్ కౌర్

ఫేక్ లీడర్లు.. మహిళలపై అభిమానం చూపుతున్నారు.. పూనమ్ కౌర్

ఫేక్ లీడర్లు.. మహిళలపై అభిమానం చూపుతున్నారు.. పూనమ్ కౌర్
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే.. జనసేన వర్సెస్ ఆ రాష్ట్ర అధికార వర్గం అన్నట్లుగా ఉంది. వాలంటీర్లపై జనసేనాని వ్యాఖ్యలు, మంత్రి రోజా సైటైర్లు.. జనసేన పార్టీ కార్యకర్తలపై పోలీసు అధికారుల దాడి ఘటనలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. ఆ వేడిని మరింత రాజేసేలా నటి పూనమ్ కౌర్ ఏపీ రాజకీయాలపై సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.

"ఏపీలో ఈ మధ్య కొందరు ఫేక్‌ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళల భద్రతపై, బాగుపై వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.." అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే పూనమ్ ఈ వ్యాఖ్యలు చేసిందని జనసేన అభిమానులు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఏదైనా ఉంటే బయటకి చెప్పాలని.. తనకు జరిగిన నష్టం గురించి తెలుపాలని అంటున్నారు. ఎన్నికలు ముందు లేదా ఏదైనా ముఖ్య రాజకీయ కార్యక్రమాలు రాష్ట్రం లో జరుగుతున్నప్పుడు.. ఇలాంటి యాడ్స్ ఎందుకు అని తప్పుబడుతున్నారు.

Updated : 17 July 2023 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top