Home > వైరల్ > థియేటర్లో పాప్కార్న్ బిల్.. చూస్తే అవాక్కే..

థియేటర్లో పాప్కార్న్ బిల్.. చూస్తే అవాక్కే..

థియేటర్లో పాప్కార్న్ బిల్.. చూస్తే అవాక్కే..
X

ఒకప్పుడు సినిమాలంటే థియేటరే.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం జనాలు థియేటర్లకు వెళ్లేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రేట్లు విపరీతంగా పెరగడం దీనికి ప్రధాన కారణం. ఓటీటీలకు క్రేజ్ పెరగడం కూడా మరో కారణం. ఒక ఫ్యామిలీ సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే వేలు ఖర్చు చేయాల్సిందే. సినిమా టిక్కెట్ కంటే.. పాప్కార్న్, కూల్ డ్రింక్ బిల్కే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తోంది. కేవలం 50 గ్రాముల పాప్ కార్న్ కు దాదాపు 500 అవుతుండడం గమనార్హం.

త్రిదీప్ కె మండల్ అనే వ్యక్తి నోయిడాలోని పీవీఆర్‌ సినిమాస్‌లో సినిమా చూశాడు. సినిమా టిక్కెట్ కాకుండా అతనికి అయిన ఖర్చు రూ.820 రూపాయలు. 50 గ్రాముల పాప్‌కార్న్ ధర రూ.460, హాఫ్ లీటర్ పెప్సీకి రూ. 360 బిల్ అయ్యింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ బిల్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘ఒక్క సినిమా కోసం నేను ఖర్చు చేసిన మొత్తం ధరతో ఏడాది పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లో కావాల్సినన్ని సినిమాల్ని చూడొచ్చు. అందుకే ప్రజలు థియేటర్‌లకు వెళ్లి సినిమా చూసేందుకు ఇష్ట పడడం లేదు’’ అని ట్వీట్ చేశాడు.

అతడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ట్వీట్‌ను 1.2 మిలియన్లకు పైగా వీక్షించగా, 17.8k లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాకు వెళ్లి సినిమా మాత్రమే చూడండి..ఏం తినకండి అని ఒకరు, థియేటర్లలో ఇంత రేట్లు ఉంటే ఎలా వెళతామని మరొకరు కామెంట్లు చేస్తున్నారు.



Updated : 3 July 2023 6:31 PM IST
Tags:    
Next Story
Share it
Top