ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ..పవన్ ఫోటో వైరల్
X
ఓ వైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీసెంట్గా విశాఖ పర్యటనను ముగించుకున్న పవర్ స్టార్ ఎలాంటి సమాచారం లేకుండా సడెన్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్‌లో కనిపించి అందరిన్నీ ఆశ్చర్యపరిచారు. పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్‌ల కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాలో పవన్‌కు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పోలీస్ డ్రెస్ వేసుకుని పవన్ సినిమా షూటింగ్ స్పాట్లో సందడి చేశారు. పవన్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో పవన్‌తో నడుస్తున్న ఫొటోను ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో షేర్ చేసిన క్షణాల్లోనే నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో #UstaadBhagatSingh ట్రెండింగ్‌లోకి వచ్చింది. నెటిజన్స్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇన్‌బాక్స్‌లో పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పవన్ ఫొటో బయటకు రావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్, డైరెక్టర్ హరీశ్‌శంకర్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి వీరి కాంబోలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పట్టాలకెక్కింది. ఈ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ నటి శ్రీలీల పవన సరసన నటించనుంది.
పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఎలక్షన్స్ కావడంతో ఎక్కువగా ఆయన పాలిటిక్స్‌కే టైంను కేటాయిస్తున్నారు. దీంతో ఆయన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్స్ ఆలస్యం అవుతున్నాయి. ఈ మధ్యనే విడుదలైన బ్రో సినిమాతో మంచి విజయం సాధించారు పవన్. ప్రస్తుతం ఆయన చేతిలో OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలను ఎన్నికలు వచ్చే లోపు కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు.
Swag king
— Manobala Vijayabalan (@ManobalaV) August 21, 2023
||#UstaadBhagatSingh | #PawanKalyan|| pic.twitter.com/0Q2RacfmkD