అంత ఆటిట్యూడ్ ఉంటే కష్టమే
X
బాహుబలితో పాపులర్ అయిన వాళ్ళల్లో నిర్మాత శోభు యార్లగడ్డ ఒకరు. ఈయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు కానీ తాను ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కచ్చితంగా చెప్పితీరతారు. ఈరోజు ఆయన పెట్టి డిలీట్ చేసేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. డిలీట్ ఎందుకు చేశారు అనే విషయం మీద కూడా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.
అసలు శోబు ఏమన్నారంటే...మంచి సక్సెస్ లో ఉన్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వలన హిట్ సినిమా వదులుకున్నారు. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్తర్తగా హ్యాండిల్ చేయాలి. ఒక కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు కనీసం గౌరవించాలి. అంతేకానీ ఆటిట్యూడ్ చూపించకూడదు. ఇలా ఉంటే అతని కెరీర్ కే నష్టం అంటూ శోభు రాసుకొచ్చారు. ఈ విషయం గురించి ఆ సదరు హీరో తొందరగానే రియలైజ్ అవుతాడనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. అయితే హీరో పేరు ఎక్కడా ప్రస్తవించలేదు. కానీ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటిలోనే దాన్ని తీసేసారు కూడా.
సోషల్ మీడియాలో ఇప్పడు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. శోభు యార్లగడ్డ పేరు చెప్పలేదు కానీ ఆయన చెప్పింది విశ్వక్ సేన్ గురించే అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే విశ్వక్ తను కథ చెప్పడానికి వెళితే కనీసం కలవలేదు అని బేబి దర్శకుడు సాయి రాజేష్ చెప్పడం, దానికి విశ్వక్ కౌంటర్ వేయడం జరిగాయి. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఈ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు శోభు చేసిన ట్వీట్ కూడా దానికి సంబంధించినదే అని నెట్ లో చర్చించుకున్నారు.
అయితే శోభు పోస్ట్ తీసేసారు కానీ తాను రాసింది విశ్వ్ సేన్ గురించి కాదు అని మళ్ళీ పోస్ట్ పెట్టారు. దీంతో నెట్ చర్చకు తెరపడింది కానీ...ఆయన ఎవరి గురించి చెప్పారు? ఆ యంగ్ హీరో ఎవరు అన్నది మాత్రం ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది.