ఎక్కడైనా చూశారా..? కాంక్రీట్లో కొండ చిలువ
X
పాములు అడవుల్లో ఉంటాయి.. పొలాల్లో ఉంటాయి.. అప్పుడప్పుడు పార్కుల్లో కనిపిస్తాయి. కానీ, అక్కడ ఓ బిల్డింగ్ లో దర్శమిచ్చింది. అది కూడా ఏకంగా 13 అంతస్తులో. ఈ వార్త విన్న జనాలు షాక్ తిన్నారు. అపార్ట్ మెంట్ లో ఉంటున్నా.. పాముల బెడద తప్పేలా లేదని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన జరిగింది ముంబైలో. విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు దాన్ని పట్టుకుని.. అటవీ శాఖ అధికారులకు అందించారు. ఇంకీ విషయం ఏంటంటే..
ముంబైలోని ఘాట్కోవర్ ప్రాంతంలో ఓ భారీ బిల్డింగ్ కడుతున్నారు. తాజాగా ఆ బిల్డింగ్ 13వ అంతస్తు స్లాబ్ వేశారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందో తెలియదు కానీ.. నాలుగు అడుగులున్న కొండ చిలువ 13వ అంతస్తులో కనిపించింది. ఒంటి నిండా కాంక్రీట్ తో.. చావు బతుకుల మధ్య, కదల్లేని స్థితిలో కనిపించింది. వెంటనే దాన్ని రక్షించి అటవీ అధికారులకు అప్పగించారు. ఆ కొండ చిలువ అంత ఎత్తుకు ఎలా వెళ్లిందని ఆలోచిస్తున్నారు.