Home > వైరల్ > చికెన్ షాపుకు వచ్చిన కొండ చిలువ

చికెన్ షాపుకు వచ్చిన కొండ చిలువ

చికెన్ షాపుకు వచ్చిన కొండ చిలువ
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొండచిలువ హల్ చల్ చేసింది. ఓ చికెన్ షాపులోకి దూరిన కొండ చిలువ నక్కి నక్కి రెండు కోళ్లను అమాంతం మింగేసింది. ఇది గమనించిన చికెన్ షాపు యజమాని ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్నేక్ ప్రొటక్షన్ ట్రస్టుకు సమాచారం అందించాడు. కొండ చిలువను బంధించిన ట్రస్టు ప్రతినిధులు దానిని అటవీ అధికారులకు అప్పజెప్పారు. పారెస్ట్ అధికారులు అది మింగిన రెండు కోళ్లను కక్కించారు. ఆ తరువాత దానిని అడవిలో విడిచిపెట్టారు. అశ్వారావుపేట మండలం వినాయకపురంలో ఈ సంఘటన జరిగింది. జనావాసాల నడుమ కొండ చిలువ రావడంతో ప్రజలు భయపడుతున్నారు. అటవీ జంతువుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇదిలా ఉంటే అటు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో ఏకంగా సబ్ స్టేషన్‎లోని ఆపరేటర్ రూమ్‎లోకి కొండచిలువ చొరబడింది. దీంతో కార్యాలయంలో ఉన్న ఆఫీసర్ ఒక్కసారిగా కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. స్థానికుల సహాయం తీసుకుని ఆ కొండచిలువను చంపేశాడు. సబ్ స్టేషన్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉండటం వల్ల తరచుగా ఇలా పాములు, కొండచిలువలు వస్తున్నాయని కార్యాలయంలోని ఎంప్లాయిస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పని చేయాలంటేనే భయం వేస్తోందని చెబుతువన్నారు.


Updated : 2 Aug 2023 10:11 AM GMT
Tags:    
Next Story
Share it
Top