Home > వైరల్ > గూండాల్లా దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్.. కార్మికులంటే అంత అలుసా?

గూండాల్లా దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్.. కార్మికులంటే అంత అలుసా?

గూండాల్లా దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్.. కార్మికులంటే అంత అలుసా?
X

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీధిరౌడీలకంటే ఘోరంగా ప్రవర్తించారు. హోటల్ కార్మికులపై రాళ్లతో, కర్రలతో విచక్షణా రహింతంగా దాడి చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేసి చదువులు చదువుకుని డొక్కడితేగాని డొక్కాడని కూలి మనుషులపై దాడి చేయడమేమిటి అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆ ఇద్దరు టాప్ లెవల్ అధికారులు సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

రాజస్తాన్‌లోని జైపూర్-అజ్మేర్ హైవే మీదున్న ఓ రెస్టారెంట్‌లో ఈ సంఘటన జరిగింది. అజ్మేర్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషన్ అయిన ఐఏఎస్ అధికారి గిరిధర్, గంగా సిటీ పోలీస్ విభాగంలో ఓఎస్డీగా పనిచేస్తున్న సుశీల్ కుమార్ బిష్ణోయ్, ఓ పోలీస్ కానిస్టేబుల్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. సుశీల్‌కు కొత్త పోస్టింగ్ వచ్చిందని విందు చేసుకున్నారు. తాగి తందనాలాడి ఇళ్లకు వెళ్తూ ఓ రెస్టారెంట్‌లో ఆగారు. బనియన్లు ధరించిన రెస్టారెంట్ కార్మికులు పనిపై అటూ ఇటూ తిరగడం సుశీల్‌కు నచ్చక తిట్టాడు. వాగ్వాదం ముదరడంతో కార్మికులపై విచక్షణారహింతగా దాడి చేశాడు. అతని ముఠా కూడా దాడికి పాల్పడింది. కార్మికులపై పిడిగుద్దులు గుద్ది రాళ్లతో కొట్టారు. హోటల్ కార్మికులు ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి దిగారు. దీంతో అధికారులు పిరికిపందల్లా తోక ముడిచి పారిపోయారు. ఈ దృశ్యాలు రెస్టారెంట్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురిని సస్పెండ్ చేసింది.


Updated : 14 Jun 2023 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top