జైలర్ పై నెగెటివ్ రిప్యూ...చావ బాదిన ఫ్యాన్స్ ...వీడియో వైరల్
X
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం నేటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోసారి రజినీకాంత్ తన స్టైల్, యాక్షన్‌తో అలరించారు. జైలర్ సినిమా విడుదలతో తమిళనాడు వ్యాప్తంగా థియేటర్స్ లో ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమాపై కూడా పాజిటివ్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరో రెండు, మూడు రోజులకు థియేటర్స్ అన్నీ బుక్ అయిపోయాయి.
అయితే జైలర్ సినిమా చూసిన ఓ ప్రేక్షకుడు నెగెటివ్ రివ్యూ చెప్పాడు. సినిమా తనకు నచ్చలేదని రివ్యూ ఇవ్వడంతో రజినీకాంత్ అభిమానులు అతడిని చితక్కొట్టారు. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటన నెట్టింట్లో విజయ్-తలైవా ఫ్యాన్స్ మధ్య అగ్గిరాజేసింది. కావాలనే రజినీకాంత్ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
#Rajinikanth fans continue to embarrass their ‘#Thalaivar’ @rajinikanth by engaging in violent activities. They beat up a harmless #ThalapathyVijay fan for expressing his opinion on the #Jailer movie. These cowards should be severely punished #JailerReviewpic.twitter.com/CKlgvJZZbw
— Ajay AJ (@AjayTweets07) August 10, 2023