Home > వైరల్ > బాధ్యతలు చేపట్టిన 15 రోజులకే గొడవ.

బాధ్యతలు చేపట్టిన 15 రోజులకే గొడవ.

బాధ్యతలు చేపట్టిన 15 రోజులకే గొడవ.
X

రతన్ టాటా...భారత్ కే కాదు ప్రపంచానికే పెద్దగా పరిచయం చేయక్కర్లేని పేరు. టాటా సంస్థ ఈరోజు ఇంత ప్రగతిని సాధించింది అంటే దానికి కారణం ఈయనే. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈయనకు ఉద్యోగ రత్న అవార్డును ఇచ్చి సత్కరించింది. తాజాగా రతన్ టాటాకు సంబంధించిన పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2013లో రతన్ టాటా చెప్పిన అనుభవం ఇది. కొలంబియా బిజినెస్ స్కూల్ లో ఒో కార్యక్రమానికి గౌరవ అతిధిగా వెళ్ళిన ఆయన అక్కడ తన అనుభవాన్ని స్టూడెంట్స్ తో పంచుకున్నారు. ఇప్పడు ఆ వీడియోనే బయటకు వచ్చింది. రతన్...టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన 15 రోజులకే ఓ గ్యాంగ్ స్టర్ అతన్ని చంపాలని ఒప్పందం చేసుకున్నాడుట. అది ఆయనకు తెలిసినా కూడా ఎటువంటి ఒత్తిడికి గురవకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళానని చెప్పారు. ఆ టైమ్ లో రతన్ తో చాలా మంది దీని గురించి చర్చించారుట. గ్యాంగ్ స్టర్ తో రాజీకి రావాలని కూడా సూచించారుట. కానీ ఆయన అవేమీ పట్టించుకోలేదని చెప్పారు.

ఆ గ్యాంగ్ స్టర్ టాటా మోటార్స్ ను కైవసం చేసుకోవాలని భావించాడుట. టాటాగ్రైప్స్ లో అతని అనుచరులను 200 మందిని కూడా ఉద్యోగులగా పెట్టాడు. కంపెనీలో జరిగే కార్యకలాపాలు అడ్డుకోవాలని కూడా చూశాడు. ఏది ఏమైనా తాను అతడిని ఎదుర్కోవాలనే నిర్ణయించుకున్నాను అంటున్నారు రతన్ టాటా. ఆయన ఊహించినట్టుగానే ప్లాంట్ లో ఉద్యోగులతో సమ్మె చేయించాడు. అతని అనుచరులు చాలా మందిని ఇన్ఫ్లూయెన్స్ చేసి విధులకు హాజరుకానివ్వకుండా చేశారు. అప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఉద్యోగానికి వచ్చేవారు. అలా వచ్చినవారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి వారితో పాటూ రోజు మొత్తం తాను కూడా ప్లాంట్ లో ఉండేవాడినని చెప్పుకొచ్చారు. అలా కొంత కాలం గడిచాక మిగతా ఉద్యోగులు కూడా పనిలోకి వచ్చారు.

మరోవైపు గ్యాంగ్ స్టర్ ప్లాంట్ మూతపడిందని ప్రచారం చేశాడు. దానిని తిప్పికొట్టడానికి , అందరు ఉద్యోగులూ విధులకు హాజరవుతున్నారని తెలిసేలా ఎడ్వర్టయిజ్ మెంట్లు చేయించానని చెప్పారు రతన్ టాటా. దీంతో తాము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ గ్యాంగ్ స్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను విడుదల అయిన తర్వాత కూడా తనను చంపడానికి ప్లాన్స్ వేశాడు. అయితే తాను ఏ మాత్రం భయపడకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయానని వీడియో చెప్పుకొచ్చారు రతన్ టాటా. అలా పట్టుదల, మొడి ధైర్యంతో ఉండడం వలన ఈ రోజు ఇంత సక్సెస్ ను అందుకోగలిగామని తెలిపారు.

Updated : 21 Aug 2023 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top