Home > వైరల్ > వీధిలో ఏరులై పారిన మద్యం.. వీడియో వైరల్

వీధిలో ఏరులై పారిన మద్యం.. వీడియో వైరల్

వీధిలో ఏరులై పారిన మద్యం.. వీడియో వైరల్
X

రాజకీయ నాయకుల ప్రసంగాల్లో ‘మద్యం ఏరులై పారింది’ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ అక్కడ అదే జరిగింది. భారీ వరద నీటితో రోడ్లన్నీ జలమయం అవడం చూసుంటాం. కానీ అక్కడ వైన్ తో వీధుల్ననీ నదిని తలపించాయి. వినడానికి వింతగా ఉన్నా. ఇది మందు బాబుల గుండెను పగిలించే నిజం. ఒక చుక్క లక్కీ డ్రాప్ కూడా వేస్ట్ చేయని వాళ్ల కళ్లముందే కొన్ని లీటర్ల వైన్ నేలపాలయింది. రెడ్ వైన్ వీధుల్ని ముంచెత్తింది. ఈ వింత అనుభవం ఎదురైంది పోర్చుగల్ దేశంలో. పోర్చుగల్ లోని సావో లోరెంకీ డి బైరో అనే నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ నగరం శివారులో లెవిరా డిస్టిలరీ (ఆల్కహాల్ తయారీ కేంద్రం) ఉంది. 2 మిలియన్ లీటర్ల రెడ్ వైన్ ఉన్న బారెల్స్ ను వేరొక చోటుకు తీసుకెళ్తుండగా.. అనుకోకుండా అది పగిలిపోయింది. దీంతో సావో లోరెంకీ డి బైరో నగర వీధుల్లో రెడ్ వైన్ ఏరులై పారింది. ఈ సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ సిబ్భంది వైన్ ను నదిలో కలవకుండా జాగ్రత్త తీసుకున్నారు. తీవ్రంగా శ్రమించి ప్రవాహాన్ని పోలాల్లోకి మళ్లించారు. దీన్నంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది.

Updated : 12 Sept 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top